కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై భూకబ్జా ఫిర్యాదు అందింది. హైదరాబాద్ కు చెందిన అడ్వొకెట్ ఇమ్మనేని రామారావు శనివారం జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జూబ్లిహిల్స్ హౌసింగ్ కోఆపరేటీవ్ సొసైటీలో 7 ఓపెన్ ప్లాట్లను కన్వర్ట్ చేసి అమ్మినట్లు రామారావు ఆరోపించారు. ఈ వ్యవహారంలో అప్పడు రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని అంటున్నారు. ఈ ఘటన 2002లో జరిగిందన్నారు.
అప్పుడు రేవంత్ రెడ్డి సొసైటీ పాలకమండలిలో ఎగ్జిక్యూటీవ్ సభ్యుడిగా ఉన్నట్లు రామారావు తెలిపారు. ఈ కుంభకోణం విషయంలో తాను ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు ఫైల్ చేయకుండా తాత్సారం చేసినందుకు వారి మీద కూడా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఈ కేసు తాలూకు ఫైళ్లన్నీ కోర్టులో పాడైపోయాయని తెలిపారు. దానికి కారకులైన వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు చేసిన అడ్వొకెట్ ఇమ్మనేని రామారావు ఏమంటున్నారో కింద వీడియోలు ఉన్నాయి చూడండి.