Madhavi Latha: వైయస్ జగన్ ను ఫాలో అవుతున్న సీఎం రేవంత్… సూటిగా ప్రశ్నించిన మాధవీ లత?

Madhavi Latha: సినీనటి మాధవి లత ఏ విషయమైనా ఎంతో ముక్కుసూటిగా మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెబుతూ ఉంటారు అయితే తాజాగా తెలంగాణ వర్సెస్ అల్లు అర్జున్ అనే విధంగా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈమె ఈ ఘటన గురించి స్పందించారు. ఈ సందర్భంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ తప్పులేదని ఈమె ఆయనకు మద్దతు తెలియజేశారు.

అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు ఆ సంఘటన ఆయనకు తెలియకుండా జరిగిపోయింది. ఆ ఘటనపై ఆయన సరిగా స్పందించకపోవడమే ఆయన చేసిన తప్పు.. తప్పుకి నేరానికి చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు. నిన్న మెదక్ జిల్లాలో ఒక చిన్న పాపను రేప్ చేశారంట దాని గురించి మాట్లాడి అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీ లని నిలదీస్తారా?..కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల వల్లే ఒక రైతు రేవంత్ రెడ్డి సోదరుడు వల్లే చనిపోతున్నానని లెటర్ రాసి మరి చనిపోయారు ఆ కుటుంబాన్ని మీరు పరామర్శించారా.

పొద్దు తిరుగుడు పువ్వు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ రైతు కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సాయం చేశారా? జరిగిన తప్పుకి ఇండస్ట్రీ పై ఉక్కు పాదం మోపాలని ఇండస్ట్రీని తన కాళ్ళ కింద పెట్టుకోవాలని రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సినిమా వాళ్ళందరిని పిలిపించుకొని వారి చేత దండం పెట్టించుకున్నారు నేనెందుకు చేయకూడదని రేవంత్ భావిస్తున్నట్టు ఉంది అంటూ ఈమె మాజీ ముఖ్యమంత్రి ప్రస్తావని కూడా తీసుకువచ్చారు.

రేవంత్ రెడ్డి గారు ఎంతో కష్టపడి పైకొచ్చి ఈ స్థాయికి వచ్చాక ఎందుకు ఇంత గలీజుగా బిహేవ్ చేస్తున్నారు.గురుకుల పాఠశాలల్లో ఎంతోమంది చనిపోతే ఏనాడైనా మాట్లాడిన పాపాన పోలేదు మీరు ముఖ్యమంత్రిగా అందరి విషయంలో ఒకే విధంగా వ్యవహరించండి ప్రస్తుతం దిల్ రాజును అడ్డుపెట్టుకొని పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు అంటూ మాధవి లత రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.