అభం శుభం తెలియని నాలుగున్నరేండ్ల బాలిక పై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన గోల్కోండ పోలీస్ స్టేషన్ లో జరిగింది. టోలీచౌకి అరుణా కాలనీలో నివసించే నాలుగున్నరేళ్ల బాలిక సెవెన్ టూంబ్స్ రోడ్డులో ఉన్న అజాన్ ఇంటర్నేషల్ స్కూల్ లో యూకేజీ చదువుతున్నది.
టోలీచౌకి నదీం కాలనీలో నివసించే మహ్మద్ జిలానీ అదే స్కూల్ లో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం అతను స్కూల్ ఆవరణలోనే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంటిక వెళ్లిన బాలికకు రక్తస్రావం అవుతుండటంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో బాలిక తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలికను వైద్య పరీక్షల కోసం నీలోఫర్ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అజాన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో బాలికపై లైంగిక పాల్పడ్డ వ్యక్తికి ఉరిశిక్ష వేయాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతారావు డిమాండ్ చేశారు. ఇంటర్నేషనల్ స్కూల్ గా చెప్పుకుంటూ చలామణి అవుతున్న ఇలాంటి పాఠశాలల్లో భద్రత కరువైందన్నారు. వెంటనే పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.