తెలంగాణ బిజెపి నేతలు కేసిఆర్ సర్కారుపై పోరాటాన్ని ఉధృతం చేశారు. పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణ ఎత్తేయాలని కోరేందుకు తెలంగాణ బిజెపి నేతలు కేసిఆర్ ను కలవాలని నిర్ణయించారు. మంగళవారం అసెంబ్లీలో సమావేశమై అక్కడినుంచి ప్రగతి భవన్ కు వెళ్లి కేసిఆర్ ను కలవాలన్నది వారి నిర్ణయం. అయితే ప్రగతి భవన్ కు వెళ్తామన్న ప్రకటన వెలువడిన వెంటనే హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమై బిజెపి ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అరెస్టు చేసేశారు. ఈ సందర్భంగా అక్రమ అరెస్టులపై బిజెఎల్పీ నేత కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమీ నిజాం రాజ్యం కాదుగదా? ఎందుకు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అనుమతిస్తేనే తాము ప్రగతిభవన్ పోతాము తప్ప దౌర్జన్యంగా పోము కదా అని ప్రశ్నించారు. అయినప్పటికీ రోడ్లమీద అరెస్టు చేసుడేంది అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడిన వీడియో కింద ఉంది. ఆయన ఇంకేమన్నారో వీడియోలో చూడండి.