హైదరాబాద్ పోలీసులకు బీజేపీ రాజా సింగ్ సవాల్ (వీడియో)

బషీర్ బాగ్ పోలీస్ కమీషనర్ ఆఫీసు ముందు మంగళవారం ఉదయం 10 గంటలకు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. గోరక్ష పేరిట ఆయన తన కార్యకర్తలతో కలిసి గోవులను రక్షించి గోశాలకు తరలిస్తుండగా పోలీసులు అక్రమంగా వారిపై మంగల్ హాట్, అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. ప్రశ్నించినందుకు తనపై కూడా ఎఫైఆర్ బుక్ చేసారని ఆయన చెబుతున్నారు.

ఆగష్టు 21 2018 న ఒక్కడినే బషీర్ బాగ్ పోలీస్ కమిషనర్ ఆఫిసు ముందు నిరాహార దీక్ష చేస్తా. నా దీక్ష అడ్డుకుని పోలీసులు అరెస్టు చేసి ఏ పోలీసు స్టేషన్ కి తరలించినా అదే పోలీస్ స్టేషన్లో నా దీక్ష కొనసాగిస్తూనే ఉంటా. నా డిమాండ్లు నెరవేర్చేవరకు దీక్ష విరమించుకోను. నా ప్రధాన డిమాండ్లు బక్రీద్ కోసం ఓల్డ్ సిటీకి తరలించిన గోవులను, గోదూడలను వెంటనే గోశాలకు తరలించాలి. గోవులను వదించటానికి అక్కడికి తెచ్చిన కసాయిలను గుర్తించి ఎంక్వైరీ జరిపించాలి. ప్రభుత్వం నా ఈ డిమాండ్లు నెరవేర్చే వరకు ఒక్కడినే దీక్ష కొనసాగిస్తా అంటూ రాజా సింగ్ వీడియో ద్వారా తెలిపారు. ఆ వీడియో కింద ఉంది చూడవచ్చు.