ప్రత్యక్ష రాజకీయాలలొకి రానున్నట్లు ప్రకటించారు మలిదశ తెలంగాణ ఉద్యమ, గొల్లకురుమ డోలు దెబ్బ వ్యవస్థాపకులు మరియు బహుజన మహ సభ రాష్ట్ర చైర్మన్ బెల్లి క్రిష్ణ. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అమరవీరుల ను విస్మరించదని, వారి ఆశయాల కొసం పనిచేస్తానని ఆయన భువనగిరిలో జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు.
సామాజిక న్యాయం కోసం భువనగిరి అసెంబ్లీ నుండి బరిలో ఉంటానని క్రిష్ణ స్పష్టం చేశారు. తెలంగాణ గాణకోకిలగా పేరోందిన బెల్లి లలిత సోదరుడే బెల్లి క్రిష్ణ. తన సోదరి బెల్లి లలిత 1999 లో పోటిలో ఉంటుందని తెలిసి దారుణంగా అప్పటి టిడిపి ప్రభుత్వం హత్య చెయించిందని తెలిపారు. బహుజన నాయకులు ఎదగ కుండ అడ్డుపడుతున్నరని తనకు కూడా ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

తనకు ఎలాంటి హని జరిగినా తెలంగాణ ప్రభుత్వం మరియు కేసీఆర్ స్థానిక నేతలు బాధ్యత వహించాలన్నారు బెల్లి క్రిష్ణ. సమావేశం అనంతరం బహుజన ఆత్మీయ పల్లెబాట కరపత్రం, ప్రచార రధాన్ని జెండా ఊపి ప్రారంభించారు. సబ్బండ కులాలకు జనాభా తామషా ప్రకారం అన్ని రంగలలొ వాట కల్పించడం కోసమే తాను ఎమ్మెల్యేగా బరిలో నిలబడలని బహుజన ప్రజల కొరుకుంటున్నారని అన్నారు. వారి కొసం అమరవీరుల అశయలకొసం పనిచేయడానికి ఎల్లప్పుడు కృషి చెస్తా అని బెల్లి క్రిష్ణ తెలిపారు.