అన్నీ వున్న ఇస్తరి అణగిమణిగి ఉంటుంది , ఏమీలేని ఇస్తారే ఎగిరి పడుతుంది అన్న సామెత లా అయిపొయింది బండ్ల గణేష్ వ్యవహారం .
బండ్ల గణేష్ అనేవాడు చాలాకాలం క్రితం ఓ చిన్న కమెడియన్ . నిర్మాతలను, దర్శకులను కాకాపడుతూ ఒకటి రెండు రోజుల వేషం సంపాదించుకొని అదే పదివేలు అనుకునేవాడు . అతనికి కాలం కలసి వచ్చి నిర్మాత అయ్యాడు , అందుకు ఓ కాంగ్రెస్ నాయకుడు సహాయ పడ్డారు అంటారు . ఏమైతేనేం పవన్ కళ్యాణ్ తో చిత్రం తీసి పెద్ద నిర్మాత గా ఎదిగాడు . అక్కడ నుంచి బండ్ల వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది .
ఆ తరువాత పవన్ కళ్యాణ్ నా దేవుడనేవాడు . వేదిక ఎక్కితే పవన్ కళ్యాణ్ పూనేవాడు . ఇక ఛానల్స్ లో డిస్కషన్స్ కు వెడితే రభస రభస చేసేవాడు . పవన్ కళ్యాణ్ “జనసేన “పార్టీ పెడితే ఆయన వెంటే నడుస్తానని శపథం చేశాడు . అయితే అనుకోకుండా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు . పార్టీలో చేరిన నాటి నుంచి ఇంటర్వ్యూ లు, స్టేమెంట్స్ ఒకటేమిటి అనేక వివాదాస్పద ప్రకటలు చేశాడు . తానొక పెద్ద నాయకుడుగా భావించసాగాడు .
తానూ ఎక్కడ నిలబడ్డా గెలుపు నల్లేరు మీద నడక అని చెప్పేవాడు . ఇక తానూ ఎక్కడ కోరుకుంటే అక్కడ పార్టీ టికెట్ ఇచ్చేస్తుందని చెప్పాడు . ఒకానొక ఛానెల్లో అయితే శాసన సభలో ప్రమాణ స్వీకారం చెయ్యడమే ఆలస్యం అన్నాడు . తీరా కాంగ్రెస్ పార్టీ బండ్ల గణేష్ గాలి పూర్తిగా తీసేసింది . కంటి తుడుపుగా అధికార ప్రతినిధి అనే పోస్ట్ కు నామినేట్ చేసినట్టు ఓ లెటర్ ఇచ్చి చేతులు దులుపుకుంది . కాంగ్రెస్ పార్టీ లో తాను ఓ చిన్నా నీటి బుడగనని ఇప్పుడైనా గణేష్ తెలుసుకుంటాడా ?