టి.బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై బీఆరెస్స్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. బండికి ఏమైనా కొమ్ములున్నాయా అని ప్రశ్నిస్తున్నారు. కవితకు ఒక రూలు – బండికి మరో రూలా అంటూ ఫైరవుతున్నారు. ఇంతకూ వారి ఆవేశానికి, పశ్నల వర్షానికి కారణం ఏమిటంటే… టీఎస్పీఎసీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో సిట్ ఇచ్చిన నోటీసులను బండి ఖాతరు చేయకుండా.. గైర్హాజరవడం. ఆయన గైర్హాజరుకు గానూ.. ఆయన లీగల్ టీం ను విచారణకు పంపడం.
అవును… ఢిల్లీ లిక్కర్ స్కాంలో మొదటిసారి విచారణకు హాజరైన కవిత.. వ్యక్తిగత కారణాలతోనో, ఆరోగ్య సమస్యలతోనో రెండోసారి విచారణకు లీగల్ టీం ని పంపించారు. అయితే అందుకు ఈడీ నిరాకరించింది. వ్యక్తిగతంగా విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చినపుడు కవిత వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందే అని ఈడీ స్పష్టంగా చెప్పింది. దర్యాప్తు సంస్ధలు విచారణకు రమ్మని పిలిచినపుడు వ్యక్తిగతంగా వెళ్ళాల్సిందే తప్ప ప్రతినిధులనో, లీగల్ బృందాన్నో పంపుతామంటే కుదరదని తేల్చింది!
స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణకు రమ్మని నోటీసులు ఇస్తే బండి సంజయ్ తన లీగల్ టీములను పంపుతున్నట్లు కబురుచేశారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నాటకలోని బీదర్ కు వెళుతున్నట్లు సిట్ కు సమాచారం అందించారు. తనకు బదులుగా తన లీగల్ టీం విచారణకు హాజరవుతుందని చెప్పారు. దీంతో… కవిత ఫ్యాన్స్ క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు.
అవును… కేంద్రప్రభుత్వం స్ధాయిలో దర్యాప్తు సంస్ధలు ఎలా పనిచేస్తాయో.. రాష్ట్ర ప్రభుత్వంలో సంస్ధలు కూడా అలాగే పనిచేస్తాయి. సీబీఐ – ఈడీ లాంటి దర్యాప్తు సంస్ధలకు ఎలాంటి అధికారాలు ఉంటాయో.. దాదాపుగా రాష్ట్రప్రభుత్వం పరిధిలో పనిచేసే సీఐడీకి కూడా అలాంటి అధికారాలే ఉంటాయి. కొన్ని సార్లు కేసుల తీవ్రతను బట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా “సిట్” ను నియమిస్తుంది రాష్ట్రప్రభుత్వం. ఈ సిట్ కు కూడా దాదాపు ఇలాంటి అధికారాలే ఉంటాయి. అలాంటిది విచారణకు రమ్మంటే రాకుండా లీగల్ టీమును పంపుతానని బండి చెప్పటమేమిటి అనేది కవిత ఫ్యాన్స్ ప్రశ్న!
కవితకు లేని మినహాయింపులు బండికి ఎందుకు? అనేది వారి ప్రత్యక్ష ప్రశ్న కాగా.. బండికి ఏమైనా కొమ్ములున్నాయా? అనేది వారి పరోక్ష ప్రశ్న! మరి కవిత ఫ్యాన్స్ అన్నారని కాదు కానీ… సామాన్య ప్రజానికంలో కూడా ఇలాంటి అనుమానాలే రేకెత్తుతున్నాయి. దీంతో ఈ విషయంపై సిట్ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. సో… “అంతా ఒకటే… విచారణకు రావాల్సిందే” అంటారా? లేక… “పర్లేదు” అని చెబుతారా అన్నది వేచి చూడాలి!