హైదరాబాద్: తెలంగాణలో శాంతి భద్రతల సమస్య ఉందని తెలిసి కేసిఆర్ చేతులు ఎత్తేశాడని ప్రభుత్వం పోషించాల్సిన పాత్రను కొంతమంది పోలీసులు పోషిస్తున్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదని చట్టానికి కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
కేసిఆర్ కి నిజంగా దమ్ము, ధైర్యం, దేశ భక్తి, తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే ఒక్క పదిహేను నిమిషాలు పోలీసులకు స్వేచ్చ ఇచ్చి చూడాలి అన్నారు.ఐపిఎస్ వ్యవస్థను కేసిఆర్ నాశనం చేస్తున్నాడు.ఎంతో నిజాయితీగా పనిచేసే ఐపిఎస్ అధికారులు ఉన్నా వాళ్ల చేతులకి సంకెళ్లు వేసి దారుణాలు జరుగుతుంటే చూస్తూ ఉండేలా చేశారని తీవ్రంగా విమర్శించారు.రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను ముఖ్యమంత్రి బ్రష్ఠు పట్టిస్తున్నాడు అన్నారు.అలాంటి వారికి స్వేచ్చ నిచ్చి చూస్తే సంఘ విద్రోహశక్తులను పట్టుకొని చట్టానికి అప్పజెప్పుతారు.ఆ దైర్యం రాష్ట్ర ముఖ్య మంత్రికి ఉందా అంటూ ప్రశ్నించాడు.
బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాను, రోహింగ్యాలు, ఎంతో మంది అక్రమంగా వచ్చి ఉంటున్నారు.అలాంటి వారిని పట్టుకునే దమ్ము కేసిఆర్ కు ఉందా అంటూ బండి సంజయ్ ప్రశ్నించాడు.రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉండాల్సిన చోట రిటైర్డ్ అధికారులను తీసుకువచ్చి వారితో అడ్డగోలుగా కోట్ల కోట్లకు కేసిఆర్ పార్టీ ఫండ్ పేరుతో సంపాదిస్తున్నాడు.పదవి విరమణ పొందిన అధికారులు చెయ్యాలిసిన పని చేయకుండా టిఆర్‌ఎస్ పార్టీకి తొత్తులుగా మారారని విమర్శించారు.