సాఫ్ట్‌వేర్ ప్రశాంత్, పావనిల ఫోన్ సంభాషణ (ఎక్స్ క్లూజివ్ ఆడియో)

పంజాగుట్టలో ఆత్మహత్యకు పాల్పడ్డ సాప్ట్ వేర్ ఇంజనీర్ (ఐఐటి ఖరగ్ పూర్ టాపర్)  ప్రశాంత్  కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. తన భార్య పావనితో ప్రశాంత్ మాట్లాడిన ఫోన్ సంభాషణలు బయటపడ్డాయి.పావని, ప్రశాంత్ ల కాల్ డేటాను పరిశీలించిన పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పావని, ప్రశాంత్ ల ఫోన్ సంభాషణలో తనకు ప్రణయ్ అనే యువకునితో వివాహేతర సంబందం ఉందని ఒప్పుకుంది. 

‘‘నువు సక్కగా లేవు, మీరెవరు నాకు అక్కర్లేదు.. నీ పెండ్లాన్ని నువ్వు సక్కా చూసుకోలేదు’’ అంటూ ప్రశాంత్  పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘నాకు కాల్స్ చేసి నన్ను వేధించకు.. సిగ్గులేదా నేను రాను అంటున్నా కూడా నా వెంట పడుతున్నావు… తెలివి తక్కువోడా… ఎడ్డోనివా నువ్వు’’ అంటూ అతనిపై కోపం వ్యక్తం చేసి నానా రచ్చ చేసింది.

‘‘నన్ను అనుమానిస్తున్నావు… నేను నీతో ఎలా రావాలి.. నీవు నీ పెళ్లాన్ని సక్కగా చూసుకోలే ఎడ్డోడా’’ అంటూ హేళన చేసింది. గతం అంతా మర్చిపో ఇప్పుడు బాగుందాం ప్లీజ్ అంటూ ప్రశాంత్ బతిలాడినా కూడా పావని కనికరించలేదు.  ప్రణయ్ వచ్చినాకే మన జీవితం నాశనమైంది అని ప్రశాంత్ అనడంతో పావని సీరియస్ అయింది. ‘ఏయ్ … వాడేం చేశాడు… వాడేం చేయలే, దీనికి మూల కారణం నువ్వు… అసలు బుద్ధి ఉందా నీకు సిగ్గులేదు. ఊకే నా వెంట పడుతున్నావు.. సిగ్గులేనోడా’’ అంటూ దూషించింది.

‘‘సరే వస్తా … కానీ నువ్వు నన్ను అనుమానించకుండా ఉంటావా చెప్పు ’’ అంటూ ప్రశ్నించింది. దానికి దానికి ఒకే అని చెప్పాడు ప్రశాంత్. ఆ తర్వాత వెంటనే ‘‘నీతో అట్లనే చెప్పుతా నేను చేసేది నేను చేస్తా ప్రణయ్ గురించి మాట్లాడకు’’ అని మళ్లీ రివర్స్ గా మాట్లాడింది. అవసరమైతే ‘‘అతనితో ఉంటా నీతో కూడా ఉంటా’’ అని ఆఫర్ ఇచ్చింది. ఏంటి పావని ఇలా మాట్లాడుతున్నావ్ అంటే.. ‘‘అంతే నేను అంతే మాట్లాడుతా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా అయితే తనకు చావే దిక్కని ప్రశాంత్ అనగా ‘‘చావు ఎవడు బతకమంటుండు నిన్ను’’ అంటూ అవమానకరంగా మాట్లాడింది.  

పావని ప్రశాంత్ ల కాల్ డేటా పరిశీలించిన పోలీసులు పావని ప్రశాంత్ ని వేధింపులకు గురిచేసిందని నిర్దారించారు. పావనికి ప్రశాంత్ తో వివాహేతర సంబంధం ఉందని తేల్చారు. వీటన్నింటిని పరిశీలించిన పోలీసులు పావనిని అరెస్టు చేశారు. దాదాపు అరగంట పాటు మాట్లాడిన వారి ఫోన్ సంభాషణ కింద ఉంది చూడండి. 

https://www.youtube.com/watch?v=YmEt3IxVSNs&feature=youtu.be