కొడంగల్ లో సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా పని చేసిన గురునాధ్ రెడ్డి అన్న కూతురు అనితా రెడ్డి. కొడంగల్, రావులపల్లి ఆమె పుట్టినిల్లు. అత్తగారిది గుల్ బర్గా కావడంతో ఆమె అక్కడే నివసిస్తుంది. అయితే కొడంగల్ లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలి అని ఆమె ఆశిస్తుంది.
గురునాధ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి టీఆరెస్ పార్టీలోకి వెళ్లినప్పటికీ తాను మాత్రం చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెబుతుంది అనితా రెడ్డి. అయితే ఆమె రేవంత్ రెడ్డిని కలవటానికి కొడంగల్ లో ఆయన ఇంటికి వెళ్లగా రేవంత్ రెడ్డి ఆమెను ఘోరంగా అవమానించారంటూ ఒక వీడియో ద్వారా తెలిపింది.
ఆమె గతంలో రేవంత్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గురునాధ్ రెడ్డి ఫ్యామిలీ టీఆర్ఎస్ లో చేరినప్పటికీ తాను మాత్రం కాంగ్రెస్ లో ఉండి రేవంత్ కు సపోర్ట్ చేస్తాను అని చెప్పింది. ఈ నేపథ్యంలో రేవంత్ తనను అవమానించేలా మాట్లాడడంటూ చెప్పి సంచలనం రేపింది. ఆ వీడియో కింద ఉంది చూడండి.