Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టు రేవంత్ రెడ్డి పై మండిపడిన మామ చంద్రశేఖర్ రెడ్డి!

Allu Arjun: సంధ్య థియేటర్ ఘటనలో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో అల్లు అర్జున్ మామ స్నేహ రెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో రేవంత్ రెడ్డి సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతగా తెలంగాణ రాజకీయాలలో కొనసాగుతున్న చంద్రశేఖర్ రెడ్డి తన అల్లుడి అరెస్టు విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు. ఈ క్రమంలోనే ఈయన సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో విడుదల సమయంలో తొక్కిసలాటలో భాగంగా రేవతి అనే అభిమాని మరణించారు. దీంతో అల్లు అర్జున్ పై కేసు నమోదు కావడం ఆయనని పోలీసులు ప్రత్యేక బృందంతో అరెస్టు చేయడం జరిగింది. అయితే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు బహిరంగ సభలో నిర్వహించినప్పుడు తొక్కిసలాటలో ఎంతోమంది చనిపోతున్నారు అలాంటప్పుడు ఆ రాజకీయ నాయకులను అరెస్టు చేస్తున్నారా అంటూ చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. ఎక్కువమంది గూమగూడిన చోట ఇలాంటి సంఘటనలు జరిగితే ఆ ఘటనకు ఎవరిని బాధ్యుల్ని చేస్తారు అంటూ ప్రశ్నించారు.

తన అల్లుడు అల్లు అర్జున్ అరెస్ట్ విషయం ఎంతవరకు సమంజసం అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి అంటూ ఈయన ప్రశ్నించారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ కావడాన్ని అభిమానులు సామాన్య ప్రజలు కూడా పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు తొక్కిసులాట జరిగి అభిమాని మరణిస్తే అందుకు అల్లు అర్జున్ బాధ్యుడిగా చేసి తనని అరెస్టు చేయడం ఏమాత్రం భావ్యం కాదని అలా చేసుకుంటూ పోతే ఈపాటికి ఎంతో మంది రాజకీయ నాయకులు జైలలోనే ఉండేవారని తన అభిప్రాయాలను తెలుపుతున్నారు.

ఇక అల్లు అర్జున్ పై నాన్ బెయిలబుల్ వారంటీ కేసు నమోదు అయిందని ఈ క్రమంలోనే తనకు బెయిల్ వస్తుందా రాదా అనే విషయంపై ఎంతో ఉత్కంఠత కొనసాగుతోంది. ఇక ఈయన లాయర్లు తెలంగాణ హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ నాలుగు గంటలకు విచారణ జరగనుంది విచారణ తర్వాత ఎలాంటి తీర్పు వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.