యువతితో స్నేహంగా ఉంటు డబ్బు కోసం దారుణానికి పాల్పడిన యువకుడు…?

ప్రస్తుత కాలంలో మహిళలకి రక్షణ కరువైంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు అని గుడ్డిగా నమ్మితే ఆ నమ్మకాన్ని వమ్ము చేసేలా కొందరు ప్రవర్తిస్తున్నారు. ఇలా స్నేహం ముసుగులో చాలామంది యువకులు అమ్మాయిల పట్ల దారుణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఇటువంటి దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా యువతీతో స్నేహంగా ఉంటూ ఆమె వివరాలు తెలుసుకున్న యువకుడు ఫోటోలను మార్కింగ్ చేసి డబ్బు కోసం బెదిరించిన ఘటన జీడిమెట్లలో చోటుచేసుకుంది.

వివరాలలోకి వెళితే… జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఒక యువతికి బాల్య స్నేహితురాలి ద్వారా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన నవదీప్‌ అని యువకుడితో ఇంస్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో నవదీప్ సదరు యువతీతో స్నేహంగా ఉంటూ ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతా వివరాలు తెలుసుకున్నాడు. యువతి ఇంస్టాగ్రామ్ ఖాతా వివరాలు తెలుసుకున్న నవదీప్ ఒక నకిలీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు.

ఆ తర్వాత సదరు యువతి ఇంస్టాగ్రామ్ లో ఉన్న ప్రొఫైల్ ఫోటో ని నగ్నంగా మార్ఫింగ్ చేసి యువతికి పంపిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని యువతిని తరచూ వేధించేవాడు. ఈ వేధింపులు భరించలేక సదరు యువతి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఈ దారుణానికి పాల్పడుతున్నది నవదీప్ అని గుర్తించి అతనిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.