యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికార టిఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. టిఆర్ఎస్ పార్టీకి చెందిన భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ సుర్విలావణ్య టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరారు. అసలు భువనగిరిలో ఏం జరిగిందో మరిన్ని వివరాలు కింద చదవండి.
యాదాద్రి భువనగిరి జిలాల్లో ఉన్న ఏకైక పురపాలక కేంద్రం భువనగిరి. 2014 ఏప్రిల్ లో జరిగిన పురపాలక ఎన్నికల్లో భువనగిరిలో టిఆర్ఎస్ పార్టీ ఒక్కటంటే ఒక్క కౌన్సిలర్ స్థానం కూడా దక్కించుకోలేకపోయింది.
భువనగిరి నియోజకవర్గం, పార్లమెంట్ కేంద్రంలో ఇలాంటి ఫలితాలు రావడాన్ని అప్పుడే టిఆర్ఎస్ పార్టీ నాయకులకు మింగుడు పడాని అంశంగా తయారయ్యింది. అయితే ఇక్కడ జరిగిన ఎన్నికల్లో 30 వార్డులకు గాను కాంగ్రెస్ 8,బీజేపీ 8,టీడీపీ 7,ఇండీపెండెంట్ 6,సీపీఎం 1 స్థానాలు గెలుచుకున్నాయి.
ఎవరికీ సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో బీజేపీ అభ్యర్థి చైర్ పర్సన్ గా ఇండిపెండెంట్, కొందరు కాంగ్రెస్ అభ్యర్థులతో పురపాలక మండలి కొలువుదీరింది. ఇది మింగుడు పడని టిఆర్ఎస్ నాయకులు స్కెచ్ వేశారు.
స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రి ఎలాగైనా భువనగిరి పురపాలక సంస్థను టిఆర్ఎస్ ఖాతాలో వేసేందుకు కసరత్తు చేశారు. మొత్తానికి మున్సిపల్ ఛైర్ పర్సన్ తో సహా 18 మంది కౌన్సిలర్లను జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి నాయకత్వం లో టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు. దీనితో భువనగిరి మున్సిపల్ టిఆర్ఎస్ కైవసం అయ్యింది.