ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వర్సెస్ ముఖ్యమంత్రి

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నెలలో నాలుగైదు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తుంటారు. వచ్చిన ప్రతి దఫా మాతృభాష గురించి నొక్కి చెబుతుంటారు. రాష్ట్రంలో ఇంగ్లీషు భాష తప్పనిసరి చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కొన్ని మినహాయింపులతో తుదకు చంద్రబాబు నాయుడు అంగీకరించినా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఒక్కరే ఖచ్చితంగా ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలని కోరుతుంటారు. వీరిద్దరూ ఒకరికొకరు పోటీగా ప్రసంగించకున్నా ఉత్తర దక్షిణ ధృవాలుగా ఇద్దరూ పరోక్షంగా మాట్లాడుతుంటారు. ఇంగ్లీషు భాష తప్పని సరికాకూడదని వ్యతిరేకించే వారినంతా నీరు పేద వర్గాలకు వ్యతిరేకులుగా ముఖ్యమంత్రి ముద్ర వేస్తున్నారు.

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కు రాజకీయ అవసరాలు లేవు కాబట్టి తన అభిప్రాయాలను ఖచ్చితంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని విధ్యార్ధి వర్దిని అనే విద్యాసంస్థ 75 సంవత్సరాల వార్షికోత్సవంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ తెలుగు భాషలో విద్యాభ్యాసం చేస్తేనే ఉద్యోగం ఇచ్చే విధానం అమలు చేయాలని కోరారు. తప్పని సరిగా మాతృ భాష లోనే విద్యాభ్యాసం జరగాలని అప్పుడే వ్యక్తిత్వ వికాసం వుంటుందని చెప్పారు.మరి ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఉప రాష్ట్రపతి తెలుగు విద్యాబోధన గురించి నొక్కి చెబుతుంటారు.

ఈ అంశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పరోక్షంగా ఘర్షణ పడే నేత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఒక్కరు మాత్రమే మిగిలారు. గమనార్హమైన అంశమేమంటే చంద్రబాబు నాయుడు నిరుపేదలకు దూరమౌతారని మాట మార్చారని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్య చేసి వుండటమే.