సాధారణంగా చాలామంది వారి వ్యక్తిగత అవసరాల నిమిత్తం లోన్ ఆప్స్ ద్వారా లోన్ తీసుకుంటూ ఉంటారు.అయితే ఈ విధంగా లోన్ ఆప్స్ ద్వారా రుణాలు తీసుకునేవారు సరైన జాగ్రత్తలు వ్యవహరించి రుణం తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే పెద్ద ఎత్తున మోసపోయి మనం తీసుకున్న దాని కన్నా రెండు మూడింతలు ఎక్కువగా డబ్బు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఇలా లోన్ ఆప్స్ ద్వారా మోసపోయి డబ్బు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి యాప్స్ విషయంలో ఎప్పటికప్పుడు అధికారులు పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంటారు.
ఇకపోతే ఈ విధమైనటువంటి లోన్ యాప్స్ ద్వారా రుణాలు తీసుకునేవారు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలను పాటించాలని ప్రముఖ బ్యాంకింగ్ సమస్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని జాగ్రత్తలను తెలియజేశారు. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల పేర్లతో వచ్చే అనుమానాస్పద లింక్స్‌ని క్లిక్ చేయకూడదని ఆ సమాచారాన్ని ఇతరులతో పంచుకోకూడదని వెల్లడించారు. ఇలాంటివి వస్తే సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు https://cybercrime.gov.in ఫిర్యాదు చేయాలని సూచించారు.
* ఏదైనా మనం యాప్ డౌన్లోడ్ చేసే ముందు ముందుగా ఆ యాప్ కి సంబంధించిన విషయాలన్నింటిని పూర్తిగా తెలుసుకొని డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది.
* మనకు ఏదైనా అనుమానాస్పదం లింక్ కనుక వస్తే పొరపాటున కూడా ఆ లింక్ పై క్లిక్ చేయకూడదు.
*అనధికార యాప్స్ ఉపయోగించకూడదు ఇలాంటి యాప్స్ ఉపయోగించడం వల్ల మీ వ్యక్తిగత డేటా మొత్తం సైబర్ నేరగాళ్లకు చేరే అవకాశం ఉంటుంది.
*మన డేటా ఇతరులు దొంగలించకుండా యాప్ పర్మిషన్ సెట్టింగ్స్ పరిశీలించాలి.
* మీ ఆర్థిక అవసరాల కోసం http://bank.sbi వెబ్‌సైట్ సందర్శించాలి.