నెట్ ఫ్లిక్స్ యూజర్లకు షాక్… ఇకపై పాస్ వర్డ్ విధానంలో మార్పులు..?

netflix free trail to indian users

ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ కొత్త సంవత్సరంలో తన యూజర్లకు భారీ షాక్ ఇవ్వనుంది. కరోనా సమయంలో థియేటర్లు మూత పడడంతో నెట్ ఫ్లిక్స్ తన యూజర్లను బాగా ఎంటర్టైన్ చేసింది. ఈ క్రమంలో ఒకరు సబ్‌స్రిప్షన్ తీసుకుని యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ ని తమ స్నేహితులు, బంధువులతో షేర్ చేసుకునేవారు. ఇలా కేవలం ఒక్క సబ్‌స్రిప్షన్ తో అందరూ ఎంచక్కా నెట్ ఫ్లిక్స్ లో లేటెస్ట్ మూవీస్, వెబ్ సిరీస్ లను వీక్షిస్తూ ఎంజాయ్ చేసేవారు. అయితే రాను రాను నెట్ ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. ఇలా సబ్స్క్రైబ్ ల సంఖ్య రోజుకి తగ్గిపోవటానికి పాస్వర్డ్ షేరింగ్ విధానమే కారణం అని నెట్ ఫ్లిక్స్ తో పాటు అన్ని ఓటీటీ సంస్థలు బావిస్తున్నాయి.

దీన్ని దృష్టిలో పెట్టుకున్న నెట్‌ఫ్లిక్స్‌(Netflix) పాస్‌వర్డ్ షేరింగ్ విధానాన్ని తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు 2023 జనవరి నుంచి యూజర్లు తమ నెట్‌ఫ్లిక్స్ ఖాతాల పాస్‌వర్డ్‌లను ఇతరులో షేర్ చేసుకోవటానికి వీలు లేకుండా ప్లాన్ చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రైబర్లు ఒక వేళ తమ పాస్‌వర్డ్‌ను షేర్ చేసుకోవాలంటే అదనంగా కొంత నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే కోస్టా రికా, చిలీ, పెరూ, లాటిన్ అమెరికన్ దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ ఈ విదానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఆ ప్రాంతాల్లో పాస్‌వర్డ్ షేరింగ్‌కు మూడు డాలర్లు( మన కరెన్సీలో రూ.250) గా నిర్ణయించారు. అలాగే భారత దేశంలో కూడా ఈ విధానాన్ని అమలులోకి తీసుకురావడానికి నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. పాస్వర్డ్ షేరింగ్ విధానం రద్దు చేస్తూ చర్యలు తీసుకోనుంది. ఒకవేళ ఎవరైనా తమ పాస్వర్డ్ షేర్ చేసుకోవాలనుకునేవారు అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మన భారతదేశంలో పాస్‌వర్డ్ షేరింగ్‌కు ఎంత వసూలు చేయనున్నారు అన్న దానిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు.