ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. దీంతో ప్రతి ఒక్కరు స్మార్ట్ఫోన్లను ఉపయోగిస్తున్నారు. రోజు రోజుకి స్మార్ట్ఫోన్ వాడకం పెరగడం వల్ల అనేక స్మార్ట్ ఫోన్ కంపెనీలు కొత్త కొత్త ఫీచర్స్ తో సరికొత్త ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. తాజాగా చైనా కు చెందిన స్పాట్ ఫోన్ నుండి మరొక కొత్త ఫోన్ మార్కెట్లోకి విడుదల అయింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా లేటెస్ట్ ఫీచర్స్ తో ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉంది. అంతే కాకుండా వీటి ధర తక్కువగా ఉండటంతో పాటు లేటెస్ట్ ఫీచర్స్ ఉండటం వల్ల వీటిని కొనుగోలు చేయడానికి ప్రజల ఆసక్తి చూపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా పోకో సంస్థ భారత మార్కెట్ లోకి పోకో ఎస్55 పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ సరికొత్త పోకో ఎస్55 స్మార్ట్ ఫోన్ ఫీచర్ లు, ధర విషయానికొస్తే… ఇందులో 6.71 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. అలాగే 20:6:9 యాస్పెక్ట్ రేషియో, 500 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్‌నెస్ తో లభించనుంది. కాగా ఇక ఈ ఫోన్‌లో ఓక్టాకోర్ మీడియాటెక్ హెలియో జీ85 ఎస్వోసీ చిప్‌సెట్ అండ్ మాలీ జీ52 జీపీయూను అందించనున్నారు. ఎల్పీడీడీఆర్4ఎక్స్ రామ్, ఈఎంఎంసీ 5.1 ఫ్లాష్ మెమొరీ కూడా రానుంది. ఇక ఈ సార్ట్ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే.. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ కలిగి ఉంది. అంతే కాకుండా డ్యూయల్ రెయిర్ కెమెరా సెటప్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నారు.
అలాగే 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ 128 స్టోరేజ్ కెపాసిటీతో అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఈ ఫోన్ ని ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ ఫోన్ కి సంబంధించిన ధర వివరాల గురించి ఇంకా వెల్లడించలేదు. అంతే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ కి సంబందించిన మరిన్ని వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే చైనా కంపెనీ అయిన పోకో సంస్థ తయారు చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ధర తక్కువగానే ఉంటుందని, తక్కువ ధరతో అత్యాధునిక ఫీచర్స్ తో ఈ ఫోన్ అందుబాటులోకి రానుందని సంస్థ వెల్లడించింది.