ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అభివృద్ధి కొత్త కొత్త టీచర్స్ తో కార్లు, మొబైల్స్, వంటి వాటిని తయారు చేస్తున్నారు . ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రముఖ కార్ల తయారీ సంస్థలు కూడా నూతన విధానంలో కార్లు తయారు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది
ఆటో ఎక్స్‌పోలో ఎంజీ హెక్టార్ ఎస్‌యూవీని (MG Hector SUV) లాంచ్ చేసారు. అందులో అందించిన 14 అంగుళాల ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ విభాగంలో అందించిన అతి పెద్ద ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం లలో ఇది కూడా ఒకటి. అయితే మీకు ఇష్టమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు దీనిపై చూడవచ్చా అని సందేహం ఉంటుంది.
హెక్టర్ ఎస్‌యూవీలో వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే మరియూ ఆండ్రాయిడ్ ఆటో అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ఆపరేటింగ్ సిస్టమ్‌ల ద్వారా మీ ఫోన్ డిస్‌ప్లేను కారు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ సిస్టం వార ప్రమాదాలను కూడా అరికట్టవచ్చు. దీంతో ప్రయాణ సమయంలో కూడా మీరు సరదాగా సినిమాలు చూస్తూ కూడా జర్నీ చేయవచ్చు. దీని కారణంగా కారు ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టంలో కూడా ఎటువంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలను కూడా అందించలేదు.కానీ మీ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టంలో ఏదైనా ప్లే చేయాల్సి ఉంటే రూటింగ్ ద్వారా చేయవచ్చు. రూటింగ్ పూర్తయిన తర్వాత ఇన్‌స్టాల్ చేయడానికి కొన్ని అనధికారిక యాప్‌లు ఉంటాయి. వాటిని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీరు మరోసారి Android Autoని ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది.
అయితే మళ్లీ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత యాప్‌ను రీ లాంచ్ చేసి, అందులో అడిగిన ప్రతి పాపప్‌కు పర్మిషన్ ఇవ్వాలి. ఆండ్రాయిడ్ ఆటో కాకుండా మీరు హెక్టర్ 14 అంగుళాల స్క్రీన్‌పై మీ ఫోన్ డిస్‌ప్లే స్క్రీన్‌ను చూడటానికి ఏఏ ఫెనో అనే యాప్‌ని కూడా డౌన్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండిటి ద్వారా మీరు చివరకు మీ హెక్టర్ లోపల నెట్‌ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ వీడియోను చూడగలరు. ఎంజీ హెక్టర్ లోపల నెట్‌ఫ్లిక్స్/అమెజాన్ ప్రైమ్ వీడియోను స్ట్రీమ్ చేయడానికిఇలా
• మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో సూపర్‌యూజర్‌ని ఇన్‌స్టాల్ చేయండి
• ఆ తర్వాత అనధికారిక యాప్‌లను ఇన్‌స్టాల్ చేయండి
• ఆండ్రాయిడ్ ఆటోను రూటింగ్ తర్వాత ఇన్‌స్టాల్ చేయండి.
• (కెన్) ఫోన్ స్క్రీన్‌ను రిఫ్లెక్ట్ చేయడానికి ఏఏ ఫెనో డౌన్‌లోడ్ చేయండి