మ్యూజిక్ వినాలంటే ఇయర్ బర్డ్స్… బ్లూటూత్ కు గుడ్ బై చెప్పేయండి… అందుబాటులోకి మ్యూజిక్ క్యాప్స్!

సాధారణంగా సంగీత ప్రియులు ఎక్కువగా పాటలను వినడానికి ఆసక్తి చూపుతుంటారు ఈ క్రమంలోనే నిత్యం వారు బ్లూటూత్ లేదా ఇయర్ బర్డ్స్ పెట్టుకొని వారికి నచ్చిన పాటలను వింటూ ఉంటారు. అయితే ప్రస్తుతం చలికాలం కావడంతో బ్లూటూత్ పెట్టుకొని చలికి క్యాప్స్ పెట్టుకోవడానికి చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మార్కెట్లోకి మ్యూజిక్ క్యాప్స్ అందుబాటులోకి వచ్చాయి.ఈ కాప్స్ పెట్టుకోవడం ద్వారా మనం యధావిధిగా పాటలను వినడమే కాకుండా చలి తీవ్రతను కూడా తగ్గించుకోవచ్చు.

ఈ మ్యూజిక్ క్యాప్స్ ను బ్లూటూత్ ఫ్యాషన్ క్యాప్ అంటారు.ప్రస్తుతం ఈ క్యాప్ మార్కెట్లోకి అందుబాటులోకి రావడంతో ఎంతోమంది సంగీత క్రియలు ఈ క్యాప్స్ ను హాట్ కేకుల్లా కొనుగోలు చేస్తున్నారు. ఈ క్యాప్ ధర మార్కెట్లో రూ. 3499 వరకు ఉన్నాయి. అయితే ఇయిర్ ఎండింగ్ ఆఫర్ల పేరుతో 77 శాతం ఆఫర్ తో కేవలం 380 కొనుగోలు చేసుకోవచ్చు.

ఈ బ్లూటూత్ ఫ్యాషన్ క్యాప్ అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీతో తయారయింది.ఈ క్యాప్‌లో కంట్రోల్ ప్యానెల్ ఇన్‌స్టాల్ చేయబడింది. అలాగే అద్భుతమైన స్పీకర్లు కూడా ఇందులో అమర్చబడ్డారు. ఇవి మనం ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఎంతో వీలుగా ఉంటుంది. అలాగే వీటి నియంత్రణకు కూడా ఎంతో అనుకూలంగా అమర్చబడ్డారు. ఇక శబ్ద నియంత్రణను కూడా ఈ బ్లూటూత్ ఫ్యాషన్ క్యాప్ లో అందుబాటులోకి తీసుకువచ్చారు.ఇలా చలికాలంలో చలి తీవ్రతను తట్టుకోవడానికి క్యాప్ ధరించి మనకు ఎంతో ఇష్టమైన మ్యూజిక్ ని కూడా ఈ బ్లూటూత్ ఫ్యాషన్ క్యాప్ ద్వారా ఎంజాయ్ చేయవచ్చు.