ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో వివిధ రకాల కంపెనీలు కొత్త కొత్త ఫీచర్స్ తో ఫోన్లోని మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. సాధారణంగా స్మార్ట్ఫోన్ ఉపయోగించడానికి అందులో ఉన్న ఫీచర్స్ ఎంత ముఖ్యమో చార్జింగ్ కూడా అంతే ముఖ్యం. ఫోన్ కొన్న కొంతకాలం వరకు చార్జింగ్ ఎక్కువ సమయం ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలానికి చార్జింగ్ తొందరగా పూర్తవుతూ ఉంటుంది. అయితే అలా చార్జింగ్ పూర్తయిన తర్వాత మళ్లీ బ్యాటరీ ఫుల్ అయ్యేదాకా చార్జింగ్ పెట్టాలంటే రెండు మూడు గంటల పాటు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా కేవలం 9 నిమిషాలలోనే బ్యాటరీ ఫుల్ చార్జ్ అయ్యే ఫోన్ మార్కెట్లోకి విడుదల అయింది.
మొబైల్ తయారీ దిగ్గజం రియల్ మీ ఈ సరికొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనిలోని ప్రత్యేకత ఎంటో తెలుసా? ఈ ఫోన్ కేవలం పది నిమిషాల్లోనే ఫుల్ చార్జ్ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023లో రియల్‌మీ జీటీ సిరీస్‌లో కొత్త ఫోన్ ని తీసుకొచ్చింది. ఫాస్టెస్ట్ ఛార్జింగ్ ఫోన్‌గా మార్కెట్లోకి వచ్చిన ఈ రియల్‌మీ జీటీ3 ఫోన్ 240 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ సౌకర్యం వల్ల 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ చార్జింగ్ పెట్టిన 10 నిమిషాల్లోనే ఫుల్ అవుతుందని వెల్లడించింది. ఇంత వేగంగా చార్జ్ చేయగలిగే సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా తమ ఫోన్ కే ఉందని పేర్కొంది. రియల్‌మీ జీటీ 3 ఐదు రకాల ర్యామ్ స్టోరేజీ వేరియంట్లలో వస్తుంది. 8జీబీ+128జీబీ, 12జీబీ+256జీబీ, 16జీబీ+256జీబీ, 16జీబీ+512జీబీ, 16బీజీ+1టీబీ మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ఇక ఈ ఫోన్ ధర భారత మార్కెట్లో రియల్‌మీ జీటీ3 ఫోన్ ధర రూ.53 వేలు నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. గతేడాది ఏప్రిల్‌లో రియల్‌మీ జీటీ2ను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇక రియల్‌మీ జీటీ3 ని ఎప్పుడు మార్కెట్లోకి విడుదల చేస్తారో ఇంకా తెలియాల్సి ఉంది. ఇక స్పెసిఫికేషన్ల వివరాలకు వస్తే ఆండ్రాయిడ్ 13తో రియల్‌మీ యూఐ 4.0 కలిగి ఉంది. 6.74 అంగుళాల 1.5కె అమోల్డ్, 144హెర్జ్ రీఫ్రెషింగ్ రేటుతో కూడిన డిస్‌ప్లే ఉంటుంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8+ జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది. ఫోన్ వెనకాల 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సార్, 8ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మైక్రో సెన్సార్స్ ఉంటాయి. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 240వాట్ల సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందుబాటులోకి రానుంది.