ప్రస్తుత కాలంలో ప్రజలకు సమయం చాలా విలువైనది. అందువల్ల ప్రతి ఒక్కరు సమయాన్ని పొదుపు చేస్తూ తమ విలువైన పనుల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కటి బయటకు వెళ్లే పని లేకుండా ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఈ ఆన్లైన్ షాపింగ్ రోజు రోజుకి పెరిగిపోవడం వల్ల అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ కంపెనీలు కూడా పండుగల సందర్భాలలో భారీ డిస్కౌంట్ లను అందిస్తున్నారు. ఇటీవల ఇయర్ ఇండ్ సందర్భంగా ఫ్లిప్కార్ట్ ఇయర్ అండ్ సేల్స్ ని ప్రారంభించింది. ఈ సేల్ డిసెంబర్ 24న ప్రారంభమై డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది. ఫ్లిప్కార్ట్ సెల్ లో స్మార్ట్ ఫోన్ లపై భారీ డిస్కౌంట్ లో ఇవ్వనుంది. శాంసంగ్, Apple, Oppo, నథింగ్ వంటి ఫోన్ పై అదిరిపోయే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
ఈ ఇయర్ ఎండ్ సేల్ లో నథింగ్ ఫోన్ పై అదిరిపోయే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్లో భాగంగా నథింగ్ ఫోన్ ని రూ. 25,999 కె సాంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 8GB +128GB వేరియంట్.. ఫ్లిప్కార్ట్లో రూ. 27,999 కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 2వేల వరకు 10శాతం డిస్కౌంట్ తో ఈ ఫోన్ని రూ. 25,999కి పొందవచ్చు. ఇక ఫ్లిప్కార్ట్ 97 యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్ల కు ఈ ఫోన్ కొనుగోలుపై 5 % క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చు.
అలాగే ఈ నథింగ్ ఫోన్ కొనుగోలుపై ఆసక్తి ఉన్నవారు No-Cost EMIని కూడా ఎంచుకోవచ్చు.నెలకు రూ. 4,334 నుంచి నో-కాస్ట్ EMI ప్రారంభమవుతుంది. ఫ్లిప్ కార్ట్ లో e ఫోన్ బ్లాక్, వైట్ కలర్లో అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ (1) వినూత్న గ్లిఫ్ ఇంటర్ఫేస్ కలిగి ఉంది. ఈ స్క్రీన్ మీ సమయాన్ని తగ్గించడంలో యూజ్ అవుతుంది.. కమ్యూనికేట్ చేసేందుకు కొత్త మార్గంగా చెప్పవచ్చు. ఎవరైనా కాల్ చేసినా ఇండికేట్ సూచిస్తాయి. అలాగే యాప్ నోటిఫికేషన్లు, ఛార్జింగ్ స్టేటస్ సూచిస్తాయి. 50 mp సెన్సార్లను కలిగిన డ్యూయల్ కెమెరాను కలిగి ఉంది. ప్రధాన కెమెరా ఫ్లాగ్షిప్ సోనీ IMX766 ద్వారా పనిచేస్తుంది. నథింగ్ ఫోన్ కొనలనుకునేవవారికి ఫ్లిప్కార్ట్ అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది.