ఫుల్ చార్జింగ్ పెట్టిన కొంత సమయానికే ఫోన్ డెడ్ అవుతోందా..ఇలా చేస్తే మీ ఫోన్ బ్యాటరీ సేఫ్..?

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ ఉపయోగించేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్లు అని తేడా లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ లు ఉపయోగిస్తున్నారు. కొంతమంది ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు తమ మొత్తం సమయాన్ని స్మార్ట్ ఫోన్ తోనే గడుపుతూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు తరచూ ఎదురయ్యే సమస్య ఫోన్ బ్యాటరీ డెడ్ అవ్వటం. ఫోన్ కొన్న కొంతకాలం వరకు బ్యాటరీ బాగా పనిచేస్తుంది. అయితే ఫోన్ కి ఛార్జింగ్ చేసే సమయంలో మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల మొబైల్ బ్యాటరీ పాడై ఫుల్ ఛార్జింగ్ పెట్టినా కూడా కొంత సమయానికి బ్యాటరీ డెడ్ అవుతూ ఉంటుంది.

ఇలా తరచూ బ్యాటరీ డెడ్ అవ్వటం వల్ల అవసర సమయాలలో ఫోన్ ఉపయోగించడం కుదరదు. ఈ క్రమంలో చాలామంది పాత ఫోన్ పక్కన పడేసి కొత్త ఫోన్ కొనుగోలు చేస్తున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మొబైల్ బ్యాటరీ డెడ్ అవ్వకుండా ఉంటుంది. ఫోన్ బ్యాటరీ డెడ్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

• సాధారణంగా కొంతమంది మొబైల్లో ఛార్జింగ్ పూర్తిగా అయిపోయిన తర్వాత చార్జింగ్ పెడుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల బ్యాటరీ లైఫ్‌పై ప్రభావం చూపుతుంది. కాబట్టి బ్యాటరీ 15-20 శాతం ఉన్నప్పుడే మీ ఫోన్ చార్జింగ్ పెట్టటం వల్ల ఇలాంటి సమస్య తలెత్తదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

• ఫోన్ చార్జింగ్ పెట్టే సమయంలో ఫోన్‌కు ఉన్న కేస్‌తో చార్జింగ్ పెడుతుంటాం. ఇలా చేయడం వల్ల ఫోన్ లో బ్యాటరీ బాగా హీట్ అవుతుంది. దీంతో బ్యాటరీ పనితీరు సరిగా ఉండదు. అందుకే ఫోన్ ఛార్జింగ్ పెట్టే సమయంలో ఫోన్ కి ఉన్న కేసును తీసి చార్జింగ్ పెట్టడం మంచిది.

• అలాగే మరికొంత మంది మొబైల్ లో 10 శాతం ఛార్జింగ్ తగ్గినా కూడా 100 శాతం ఉండాలని తరచూ ఛార్జింగ్ పెడుతూ ఉంటారు. ఇలా ఛార్జింగ్ ఉన్నా కూడా తరచూ ఛార్జింగ్ పెట్టటం వల్ల కుడ్ బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోయే అవకాశం ఉంటుంది.