ప్రస్తుత కాలంలో ప్రతి వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉంటుంది. రైతులు, ఉద్యోగస్తులు, చదువుకునే పిల్లలు ఇలా అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండటం తప్పనిసరిగా మారిపోయింది. అయితే కొంతమంది ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్ లు కలిగి ఉంటారు. అయితే ఇలా ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్ లో కలిగే ఉండటం వల్ల వాటి నిర్వహణ కష్టంగా మారుతుంది. ఇలా ఎక్కువ సంఖ్యలో బ్యాంక్ అకౌంట్ లో ఉండటం కూడా ప్రభుత్వం నిషేధించింది. ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్ లో ఉండటం వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కోవడమే కాకుండా చాలా వరకు నష్టపోతారు.
అయితే బ్యాంక్ అకౌంట్ తెరిచిన తర్వాత తప్పనిసరిగా మినిమం బాలన్స్ మైంటైన్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్ కి మినిమం బాలన్స్, ఏటీఎం, చెక్ బుక్ వంటి మెయింటెనెన్స్ ల వల్ల ప్రతినెలా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్ లో ఉన్నవాళ్లు ఎలా ప్రతినెలా వారికి ఉపయోగం లేకపోయినా అకౌంట్ మెయింటైన్ చేయటానికి కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మన అకౌంట్ లో మినిమం బాలన్స్ లేకపోయినా కూడా బ్యాంక్ యాజమాన్యం పెనాల్టీ విధిస్తుంది. ఈ పెనాల్టీ రూ. 500. 10,000 నుండి రూ. వరకు ఉంటుంది. అలాగే ఈ పెనాల్టీ మీ CIBIL స్కోర్‌పై కూడా ప్రభావం చూపుతుంది.
ఎక్కువ బ్యాంక్ అకౌంట్ లు ఉండటంవల్ల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులను ఉపయోగిస్తే వాటికి సకాలంలో బిల్లు చెల్లించటం మరచిపోతే ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అలాగే ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు ఉన్నప్పుడు, అకౌంట్ ఫ్రీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్రీజ్ అకౌంట్ల వల్ల మోసానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇలా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు మెయింటైన్ చేయటం వల్ల ప్రతి నెల చాలా మొత్తంలో డబ్బు నష్టపోవాల్సి వస్తుంది.