భారతదేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాదాపు 40 కోట్ల మంది యూజర్లు ఉన్న విషయం తెలిసింది. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్లు సైతం పెద్ద ఎత్తున మోసాలు చేయడానికి పాల్పడుతున్నారు. ఇకపోతే సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా యూజర్లకు ఎస్బిఐ పేరుతో మెసేజ్లు పంపించి వారిని ఈజీగా ట్రాప్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు పాన్ కార్డు అప్డేట్ చేయమని అడుగుతూ ఎస్బిఐ నుంచి కస్టమర్లకు లింక్ పంపిస్తున్నారు.
పొరపాటున గనక మనం ఈ లింక్ ఓపెన్ చేయగానే మన బ్యాంకు వివరాలు ఆధార్ కార్డు పాన్ కార్డు వివరాలు అన్నింటిని కూడా అడుగుతుంది.ఇలా మనం మన బ్యాంకు వివరాలన్నింటినీ కూడా ఎంటర్ చేస్తే కనుక మన అకౌంట్ మొత్తం ఖాళీ అవుతుందని చెప్పాలి.ఇలాంటి మెసేజ్లు కనుక వస్తే పొరపాటున ఎవరూ కూడా ఎంక్వైరీ చేయకుండా వాటిపై క్లిక్ చేయకూడదని స్టేట్ బ్యాంక్ తమ యూజర్లను హెచ్చరిస్తోంది.
ఒకవేళ మీకు పదేపదే ఇలాంటి మెసేజ్లు కనుక వస్తే వెంటనే report.phishing@sbi.co.in కి మెయిల్ చేయాలి.ఒకవేళ మీరు మీ బ్యాంక్ అకౌంట్ కు పాన్ నెంబర్ లింక్ చేయకపోతే ఆన్లైన్ ద్వారా కూడా లింక్ చేయవచ్చు. https://www.online.sbi/ అనే పోర్టల్ ఓపెన్ చేసి దీనిద్వారా మన వ్యక్తిగత బ్యాంకు విషయాలతోపాటు పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి మనం లింక్ చేసుకోవచ్చు లేదంటే సమీపంలో ఉన్నటువంటి బ్యాంకుకు వెళ్లి ఒక ఫామ్ ఫుల్ చేసి అనంతరం పాన్ కార్డు జిరాక్స్ అటాచ్మెంట్ చేస్తే చాలు. బ్యాంక్ అకౌంట్ కు పాన్ కార్డు లింక్ అయినట్టే