వావ్… టాప్ పెర్ఫార్మన్స్ తో క్వాలిఫైయర్-2లో అడుగుపెట్టిన హైదరాబాద్, ఐపీయల్ నుండి కోహ్లీ సేన అవుట్

Sunrisers Hyderabad won by 6 wickets
Sunrisers Hyderabad won by 6 wickets
Sunrisers Hyderabad won by 6 wickets

ఐపీఎల్-2020:ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. దుబాయ్ వేదికగా చివరి ఓవర్ వరకు సాగిన ఉత్కంఠ పోరులో .. బెంగళూరును ఓడించి.. క్వాలిఫైయర్-2లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది వార్నర్ సేన. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి..131 పరుగులు చేసింది. SRH బౌలర్ల ధాటికి ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. కెప్టెన్ కొహ్లీ ఓపెనింగ్ రావడం ఏ మాత్రం కలిసి రాలేదు. ఏబీ డివిలియర్స్ 56, అరోన్ ఫించ్ 32 పరుగులతో రాణించారు. మిగతా అందరూ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. విరాట్ కొహ్లీ 6, పడిక్కల్ 1, మోయిన్ అలీ 0, శివం దూబె 8, వాషింగ్టన్ సుందర్ 5 రన్స్ మాత్రమే చేశారు. సైని 9, సిరాజ్ 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఏబీ డివిలియర్స్ ఒంటరి పోరు చేసి టీమ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. లేదంటే బెంగళూరు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.

 

132 పరుగుల ఛేదనలో హైదరాబాద్‌కి మెరుగైన ఆరంభం లభించలేదు. సాహా స్థానంలో టీమ్‌లోకి వచ్చిన ఓపెనర్ శ్రీవాత్స గోస్వామి (0) తొలి ఓవర్‌లోనే ఔటవగా.. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (17: 17 బంతుల్లో 3×4) దూకుడు ఒక ఓవర్‌కే పరిమితమైంది. అయినప్పటికీ.. మనీశ్ పాండే (24: 21 బంతుల్లో 3×4, 1×6) కలిసి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దిన కేన్ విలియమ్సన్.. బంతులు, పరుగుల మధ్య అంతరం పెరగకుండా బాధ్యత తీసుకున్నాడు. అయితే.. టీమ్ స్కోరు 55 వద్ద మనీశ్ పాండే ఔటవగా.. అనంతరం వచ్చిన ప్రియమ్ గార్గె (7) కూడా ఒత్తిడికి గురై వికెట్ చేజార్చుకున్నాడు. దాంతో.. చివర్లో కాస్త ఉత్కంఠ నెలకొన్నా.. జేసన్ హోల్డర్ (24: 20 బంతుల్లో 3×4)తో కలిసి విలియమ్సన్ టీమ్‌ని విజయతీరాలకి చేర్చాడు. హైదరాబాద్ విజయానికి చివరి 6 బంతుల్లో 9 పరుగులు అవసరమవగా.. తొలి బంతికి విలియమ్సన్ సింగిల్ తీయగా.. మూడు, నాలుగు బంతుల్ని బౌండరీకి తరలించిన హోల్డర్ గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు.