ఐపీయల్-2020,షార్జా : ఈ సీజన్లో లో చివరికి వెళ్తున్న కొద్దీ ప్లే ఆఫ్స్ లో ఏ టీమ్స్ ఉంటాయో అని అందరికి ఉత్కంఠత నెలకొన్నది . షార్జాలో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. కీలకమైన మ్యాచ్‌లో బెంగళూరును ఓడించి ప్లేఆఫ్స్ రేస్‌లో నిలిచింది. పాయింట్ల పట్టికలో ఏకంగా నాలుగో స్థానానికి ఎగబాకింది.
121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని హైదరాబాద్ బ్యాట్స‌్‌మెన్ కాస్త కష్టపడుతూనే చేధించారు. 14.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి బెంగళూరును ఓడించింది హైదరాబాద్. వృద్ధిమాన్ సాహా 39, జేసన్ హోల్డర్ 26, మనీష్ పాండే 26 పరుగులు చేశారు. వార్నర్ 8, విలియమ్సన్ 8, అభిషేక్ శర్మ 8 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యారు. తక్కువ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్.. ఆరంభంలోనే తడబడింది. రెండో ఓవర్‌లోనే కెప్టెన్ వార్నర్ ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన మనీష్ పాండేతో కలిసి సహా ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. రెండో వికెట్‌కు వీరిద్దరు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 60 పరుగుల వద్ద మనీష్, 82 వద్ద సాహా, 87 వద్ద విలియమ్సన్ ఔట్ కావడంతో స్కోర్ నెమ్మదించింది. ఐతే అనంతరం క్రీజులోకి వచ్చిన హోల్డర్ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. అభిషేక్ ఔటైనప్పటికీ.. ధాటికి ఆడి జట్టును గెలిపించాడు హోల్డర్. ఈ వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కేవలం 10 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్స్‌లు, ఒక ఫోర్ ఉన్నాయి.
A 5-wicket win and two crucial points in the bag for @SunRisers 💪💪#Dream11IPL pic.twitter.com/rsuO6svtVx
— IndianPremierLeague (@IPL) October 31, 2020
అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తక్కువ పరుగులకే పరిమితం చేశారు హైదరాబాద్ బౌలర్లు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేసింది. జోష్ ఫిలిప్పి 32, ఏబీ డివిలియర్స్ 24, వాషింగ్టన్ సుందర్ 21, గుర్‌కీరట్ 15 పరుగులు చేశారు. దేవదత్ పడిక్కల్ 5, విరాట్ కొహ్లీ 7, క్రిస్ మోరిస్ 3 పరుగలే చేసి ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు. మూడో ఓవర్లోనే దేవదత్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది బెంగళూరు. ఆ తర్వాత ఐదో ఓవర్‌లో కొహ్లీ ఔట్ అవడంతో బెంగళూరుకు పెద్ద దెబ్బ పడింది. అనంతరం ఫిలిప్పి, డివిలియర్స్ 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 71 పరుగుల వద్ద డివిలియర్స్, 76 పరుగుల వద్ద ఫిలిప్పి ఔట్ కావడంతో స్కోర్ వేగం మందగించింది. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడడంతో బెంగళూరు 120 పరుగులు మాత్రమే చేయగలిగింది.