టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు లైన్ క్లియర్ అయింది. ఎన్సీఏ లో శుక్రవారం వైద్య బృందం నిర్వహించిన ఫిట్ నెస్ టెస్టులో హిట్మ్యాన్ పాసయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. బీసీసీఐ వైద్య బృందంతోపాటు ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, సెలక్టర్ల పర్యవేక్షణలో రోహిత్ కు ఫిట్నెస్ పరీక్ష నిర్వహించారు.
కాగా ఫిట్నెస్ పరీక్షలో రోహిత్ సఫలం కావడంతో డిసెంబర్ 14న ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాగా రోహిత్ నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటైన్ అనంతరం జట్టుతో కలవాల్సి ఉంటుంది. దీంతో తొలి రెండు టెస్టులకు దూరం కానున్న రోహిత్ చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడు.
కాగా మొదటి టెస్టు అనంతరం టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి పెటర్నీటి సెలవులపై స్వదేశానికి రానున్నాడు. కోహ్లి స్థానంలో మిగిలిన మూడు టెస్టులకు అజింక్యా రహానే కెప్టెన్గా వ్యవహరిస్తాడు.