టీ 20 ఓపెనర్లను ప్రకటించిన హార్దిక్ పాండే… పృద్విషా ఆగాల్సిందేనా?

న్యూజిలాండ్ పై మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా.. ఇప్పుడు మూడు టీ20ల సిరీస్‌ కోసం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే భారత్ న్యూజిలాండ్ మధ్య రాంచి వేదికగా తొలి టీ20 మ్యాచ్ నేడు జరగనుంది. ఈ సీరీస్ లో భాగంగా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, సీనియర్‌ ప్లేయర్‌, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో పాటు స్టార్‌ పేసర్లు మొహమ్మద్‌ షమీ, మొహమ్మద్‌ సిరాజ్‌లకు విశ్రాంతి ఇచ్చారు. ఈ క్రమంలోనే కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలో న్యూజిలాండ్ తో టీమిండియా తలపడనుంది.

భారత జట్టులో చోటు కోసం యువ క్రికెటర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో తుది జట్టు ఎంపిక ప్రతి మ్యాచ్‌కు ముందు ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ఓపెనింగ్‌ స్థానాల కోసం ముగ్గురు ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. ఇషాన్‌ కిషన్‌, శుబ్‌మన్‌ గిల్‌, పృద్విషా. వీరి ముగ్గురిలో పృథ్వీ షా సీనియర్‌ ప్లేయరే అయినా.. ప్రస్తుతం ఇషాన్‌, గిల్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈ సిరీస్ లో ఓపెనర్ గా ఎవరిని పంపించాలనే విషయంపై కెప్టెన్ హార్దిక్ పాండే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం గిల్ ఉన్న ఫామ్ దృష్ట్యా ఓపెనర్ గా ఇషాన్ కి జోడిగా అతనిని ఆడించాలని తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించారు. పృద్విషా కొంత సమయం పాటు వేచి ఉండాలంటూ ఈ సందర్భంగా హార్థిక్ పాండే టీ 20 ఓపెనర్లను ప్రకటిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.