న్యూజిలాండ్ క్రిస్టిచర్చ్ నగరంలోని రెండు మసీదుల్లో శుక్రవారం ఉదయం ఒక ఆగంతకుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 40 మంది మరణించారు. మరోక 20 మంది గాయపడ్డారు. నల్లరంగు దుస్తులు ధరించిన ఒక వ్యక్తి మిషన్ గన్ మెన్ తో అల్ నూర్ మసీదుతోపాటు మరోక మసీదు లోపలకు చొరబడి తో కాల్పులకు తెగబడ్డాడు. శుక్రవారం ప్రార్థనలకు సమాయత్తమవుతున్నపుడు ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో 40 మంది మరణించగా, 20 మంది గాయపడ్డారని పోలీసులు చెప్పారు.
నిజానికి ఈ అల్ నూర్ మసీదు లోకి బంగ్లా క్రికెట్ టీమ్ కూడా ప్రార్థనల కోసం ప్రవేశించింది. అయితే, వారంతా సురక్షితంగా బయటపడ్డారు.
మసీదులో మసీదులో 12 సార్లు కాల్పుల శబ్ధం వినిపించిందని ప్రత్యక్షసాక్షి ఒకరు వివరించారు. ఈ వూచకోతకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. ఇందులో ఒకరు ఆస్ట్రేలియన్. ఈ దాడిని టెర్రరిస్టు దాడిగా న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెర్న్ వర్ణించారు.‘ ఒక తీవ్రవాద, రైట్ వింగ్ హింసాకాండ’ అని ఆయన అన్నారు. ఈ దాడిలో గాయపడిన వారంతా చాలమంది ఈదేశానికి వలసవచ్చిన వారని, కొందరయిన ఆశ్రయం కోరి వచ్చిన వారని, అయితే వారంత ఎవరో కాదు, మనమే అని ప్రధాని అన్నారు. ఈ దాడిని ఒక తీవ్రవాది లైవ్ లో ప్రసారం చేశారు. ఊచకోతను ఆనలైవ్ ప్రసారం చేసిన ఆగంతకుడుచివరలో కెమెరాను తన మీదకు మళ్లించి తనెవరో కూడా పరిచయం చేసుకున్నాడు.
తనని పేరు బ్రెంటన్ టర్రాంట్ (28)అని చెబుతూ తన దుష్ట కార్యకలాపాల మీద 37 పేజీల మానిఫెస్టో ను జతపరిచాడు. మొదట ఫేస్ బుక్ లో ప్రసారమయిన లైవ్ వీడియో ని తర్వత యూట్యూబ్ లో ప్రసారమయింది. ఈ మ్యానిఫెస్టో పేరు ది గ్రేట్ రిప్లేస్ మెంట్. తనని ఒక ‘జస్ట్ యాన్ అర్డినరీ వైట్ మన్ ’ గా చెప్పుకుంటూ తను ఆస్ట్రేలియా కు చెందిన ఒక అల్పాదాయ వర్కింగ్ క్లాస్ కుటుంబంలో జన్మించాడని ప్రకటించుకున్నాడు. తన దాడికి కారణమ విదేశాలనుంచి దాడుల చేస్తున్న వైనమేకారణమని చెప్పాడు.
తన వీడియో స్ట్రీమింగ్ ని let’s get this party started అంటూ ప్రారంభించాడు.