న్యూజిలాండ్ నరమేధం: నిందితుడి మీద హత్యానేరం

శుక్రవారంనాడు న్యూజిలాండ్‌ క్రిష్ట్ చర్చ్ లోని అల్ నూర్, లిన్ వూడ్  మసీదులలో నరమేధం సృష్టించిన ఆస్ట్రేలియా శ్వేత దురహంకారి బ్రెంటన్‌ హ్యారిస్ టారంట్‌ మీద హత్యా నేరం మోపారు.

పోలీసులు శనివారం నాడు అతగాడిని తెల్లటి జైలు బనియన్ తో కోర్టు బోనులో నిలబెట్టారు.జడ్డి ఒకే ఒక నేరారోపణ,హత్యారోపణ, ను చదివి వినిపించారు. తర్వాత ఇతర నేరారోపణల చిట్టా తయారవుతుందనుకుంటున్నారు.

టరాంట్ గతంలో ఫిట్ నెస్ అడ్వయిజర్ గా పని చేశాడు.అయితే, తనను తాను ఫాసిస్టుగా చెప్పుకుంటుంటాడు. కోర్టు విచారణ సమయంలో టరాంట్ మీడియా వైపు చూస్తూ ఉన్నాడు.

భద్రత కారణాల వల్ల ఈ రోజు విచారణకు ప్రజలను అనుమతించలేదు.

పోలీసులను కోర్టులోకి తీసుకువస్తున్నపుడు టరాంట్ ఒ.కె సైన్ ను తలికిందులుగా చూపాడు. ఇది శ్వేత దురహంకారులు చేసుకున్న అలవాటు.

కోర్టులో అతను బెయిల్ కోరలేదు. అందువల్ల పోలీసులు అతడిని జైలుకు తీసుకువెళ్లారు. తదుపరి విచారణ ఏప్రిల్ 5న ఉంది.

కోర్టు సమీపంలోని ఒక ఆసుప్రతిలో  నిన్నటి కాల్పుల్లో గాయపడిన 39 మందికి చికిత్స కొనసాగుతూ ఉంది. డాక్టర్లు రాత్రంతా పనిచేశారు. చికిత్స పొందుతున్నవారిలో రెండేళ్ల బాలుడు, నాలుగేళ్ల బాలిక పరిస్థితి క్రిటికల్ గా ఉందని డాక్టర్లు చెప్పారు.

నిన్న అల్ నూర్, లిన్ వూడ్ మసీదుల మీద జరిగిన దాడిని టెర్రిరిస్టు దాడిగా ప్రధాని జెసిండా అర్డర్ణ్ వర్ణించారు. శుక్రవారం నాటి దాడిలో అనేక ముస్లిం దేశాల సంతతి వారు గాయపడటమో గల్లంతవడమో జరిగింది. భారత దేశానికి చెందిన 9 మంది గల్లంతయినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన 6 గురికి గాయాలయ్యాయి.