పెళ్లయిన కొత్తలో.. పచ్చబొట్టు.. తర్వాత ఏమైందంటే (వీడియో)

పచ్చబొట్టు కొత్త కాపురంలో చిచ్చురేపింది. ఆ జంట పెళ్లై ఐదు రోజులే అవుతుంది. దేవుని ఆశీర్వాదం పొందుదామని సాయిబాబా గుడికి వెళ్లారు. దర్శనం అయ్యాక మెట్లపై కూర్చుని సరదాగా ముచ్చట పెడుతున్నారు. కొంత జంట కదా ముచ్చట్లో మునిగిపోయారు. అప్పుడే తన భర్త చేయి పై ఉన్న పచ్చబొట్టును చూసింది భార్య. అంతే … ఎందుకో ఆమెకు అనుమానం కలిగింది. ఆ పేరు ఎవరిదని అడిగింది. అబ్బాయికి నోటి వెంట మాట రాలేదు. ఏమనుకుందో ఏమో అమ్మాయి గుడి అని కూడా చూడకుండా అతనిపై శివతాండవం చేసింది. అందరూ చూస్తున్నారు అని కూడా చూడకుండా ఎడాపెడా వాయించింది. దీంతో అతను ఏడుపురాగమెత్తుకున్నాడు తప్ప ఏమి చేయలేకపోయాడు. తమిళనాడులోని కొయ్యంబత్తూరు జిల్లాలోని మెట్టుపాళయంలోని సాయిబాబా ఆలయంలో జరిగింది ఈ ఘటన. ఈ  వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో కింద ఉంది మీరు చూడండి.