మాక్ డ్రిల్.. ఈ తమిళ అమ్మాయిని బలితీసుకుంది (వీడియో)

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో విషాదం  జరిగింది. కళైమగల్ కళాశాలలో నిర్వహిస్తున్న మాక్ డ్రిల్ లో అపశృతి చోటు చేసుకుని 19 ఏళ్ల విద్యార్థిని లోగేశ్వరి చనిపోయింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా ప్రాణాలను రక్షించుకోవాలన్న దానిపై ఎన్‌డీఎంఏ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బీబీఎం రెండో సంవత్సరం చదువుతున్న లోగేశ్వరి సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకు దూకాల్సి వచ్చింది. కింద విద్యార్థులు వల పట్టుకున్నప్పటికి ట్రైనర్ వెనుక నుంచి నెట్టివేయడంతో లోగేశ్వరి తల ఫస్టు ప్లోరులో ఉన్న దిమ్మకు తగిలడంతో ఆమెకు తలకు బలమైన గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో విద్యార్థిని చనిపోయింది.

ఈ  ఘటనపై స్పందించిన ఎన్‌ఎండీఏ అధికారులు మేము ఏ కాలేజిలో మాక్ డ్రిల్ నిర్వహించలేదని, మాక్ డ్రిల్ నిర్వహించిన ఆర్ముగానికి తమకు ఎటువంటి సంబంధం లేదని తెలిపింది.  సరైన వివరాలు తీసుకోకుండా మాక్ డ్రిల్ నిర్వహించి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.