కరీంనగర్‌లో తప్పిన ప్రమాదం ( వైరల్ అవుతున్న వీడియో)

కరీంనగర్‌లో పెనుప్రమాదం తప్పింది. హైవేపై అతి వేగంగా దూసుకొచ్చిన మినీట్రక్కు వ్యాను కారును ఢీకొని డివైడర్ పైకి దూసుకెళ్లింది.  ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాకపోవడంతో కారులో, ట్రక్కులో ప్రయాణిస్తున్న వారంతా  బతుకు జీవుడా అంటూ బయట పడ్డారు. కానీ ప్రమాదం తప్పిన తీరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమాదం జరిగిన తీరును అక్కడే ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో ప్రొఫెషనల్ గా ఉండడంతో చూసినవారందరూ ఔరా అంటున్నారు. తెగ షేర్ చేస్తున్నారు. కింద వీడియో ఉంది.

1.
0:17