“NBK 107” షూటింగ్ లోకి వచ్చిన స్టార్ హీరోయిన్..పిక్ వైరల్..!

టాలీవుడ్ స్టార్ అండ్ మాసెస్ట్ హీరోల్లో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఒక సరైన హిట్ అందుకుంటే ఎలా ఉంటుందో దాన్ని భారీ హిట్ “అఖండ” తో బాలయ్య చూపించారు. దీనితో నెక్స్ట్ సినిమాపై మాత్రం తార స్థాయి అంచనాలు నెలకొన్నాయి. దీనితో ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. 

దర్శకుడు గోపీచంద్ మలినేని అయితే అదిరే ఎలిమెంట్స్ తో సినిమాని తెరకెక్కిస్తుండగా రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కూడా అదిరే అప్లాజ్ ని కూడా దక్కించుకుంది. మరి ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్ గా యంగ్ హీరోయిన్ శృతి హాసన్ ఫిక్స్ అయ్యిన సంగతి తెలిసిందే. 

అయితే ఇప్పుడు ఈమె ఈ సినిమా దాదాపు 40 శాతం కంప్లీట్ అయ్యిన తర్వాత సెట్స్ లో జాయిన్ అయినట్టుగా మేకర్స్  తాజాగా అనౌన్స్ చేశారు. దర్శకుడు గోపీచంద్ తో సెట్స్ లో కూర్చొని శృతి హాసన్ మంచి ఎనర్జిటిక్ గా కనిపిస్తుంది.

దీనితో ఈ స్టార్ హీరోయిన్ ఇన్ NBK 107 సెట్స్ పిక్ మంచి వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ కన్నడ నుంచి పలువురు స్టార్ నటులు నటిస్తున్నారు.