సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటీమణులు సినిమాలలో నటిస్తూ వివాహం చేసుకుంటే సినిమా అవకాశాలు తగ్గుతాయని పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితం గడుపుతున్నారు. మరొకవైపు ప్రేమలో విఫలమైన నటీమణులలో కూడా చాలామంది పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఆ కోవకు చెందిన వాళ్లను ఇప్పుడు చూద్దాం.
సితార: తెలుగు ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్గా అవకాశాలు తగ్గినా కూడా తల్లి, వదిన పాత్రలతో నటిస్తూ సినిమాలలో రాణిస్తుంది. ఈమె వివాహం చేసుకోకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది అదేమిటంటే తమిళ నటుడు మురళిని ప్రేమించడం జరిగింది.
కొన్ని రోజుల ప్రేమాయణం తర్వాత ఇద్దరు విడిపోయి మురళి వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. సితార మాత్రం అతని జ్ఞాపకాలతో బతుకుతూ ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. ఆమధ్య మురళి చనిపోయినప్పుడు తీవ్రంగా బాధపడడం జరిగింది.
నిర్మల: తెలుగు చిత్రాలలో అత్తగా, తల్లిగా నటించి చివరకు బామ్మ పాత్రలలో కూడా నటిస్తున్న ఈమె ఇంతవరకు వివాహం చేసుకోలేదు. అందుకు కారణం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటుడు ఎంజీఆర్ ను ప్రేమించడం జరిగింది. ఇద్దరు కలిసి కొంతకాలం గాఢంగా ప్రేమించుకున్నారు.
కానీ ఎంజీఆర్ జీవితంలో చాలామంది అమ్మాయిలను ప్రేమించడం జరిగింది. తర్వాత కొన్ని మనస్పర్ధ కారణంగా నిర్మల దూరంగా ఉంటూ ఒంటరిగా జీవించడానికి ఇష్టపడింది. సినిమాలలో తనదైన శైలిలో నటిస్తూ రాణిస్తుంది.
జయలలిత: ఈమె కూడా హీరోయిన్గా కెరీర్ ప్రారంభించి, తర్వాత రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకుంది. జయలలిత కూడా ముందు శోభన్ బాబును ప్రేమించి తర్వాత ఎంజీఆర్ ను ప్రేమించడం జరిగింది. కొన్ని కారణాలవల్ల పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని రాజకీయంగా ప్రజలకు సేవ చేయడానికి వినియోగించడం జరిగింది. కొన్ని అనారోగ్య కారణాలవల్ల మరణించడం జరిగింది.
ముత్యాలముగ్గు సంగీత: ఈమె తెలుగు సినిమాలలో హీరో, హీరోయిన్లకు తల్లి అత్త, పాత్రలలో నటించడం జరిగింది. ఈమె కూడా ఎంజీఆర్ ను ప్రేమించడం జరిగింది. ఇండస్ట్రీలో ఈమెను ఎంజీఆర్ సంగీతాన్ని కూడా పిలిచేవారు. కొంతకాలం గాఢంగా ప్రేమించుకున్న తర్వాత ఒంటరిగా జీవిస్తూ సినిమాలలో నటిస్తుంది.
టబు: హీరోయిన్ గా అందరికీ సుపరిచితమే. ఈ నటి అజయ్ దేవగన్ తో ప్రేమలో పడింది. కొంతకాలం సాఫీగా సాగిన విని ప్రేమ అనుకోని కారణాలవల్ల విఫలం కావడంతో ఒంటరి జీవితం గడుపుతుంది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వినిపించిన ఎప్పుడు పెళ్లి పై స్పందించలేదు ఇంతవరకు వివాహం కూడా చేసుకోలేదు.