పారితోషకం భారీగా పెంచేసిన పవన్ కళ్యాణ్ అత్త.. !

తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది అనే చిత్రంలో హీరో అత్త పాత్రలో నటించి తన నటనతో సినీ ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రముఖ సీనియర్ నటి నదియా గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నదియా మలయాళ సినీ పరిశ్రమకి చెందిన నటి అయినప్పటికీ తెలుగులో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకుంది.

1985లో తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోలందరితో జత కట్టిన నదియా మూడేళ్ళలోనే పెళ్లి చేసుకొని సినిమాలకి స్వస్తి చెప్పింది. అయితే సినిమా కెరీర్ లో వరుస అవకాశాలతో బాగానే రాణిస్తున్న 1988లోనే శిరీష్ అనే ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తర్వాత నదియా యునైటెడ్ స్టేట్స్ కి వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయ్యింది నదియా.

అయితే కొన్ని రోజుల తరువాత ఆమె ఇండియా కి తిరిగి వచ్చి నదియా కుటుంబంతో కలిసి చెన్నైలో స్థిరపడింది. మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే వరుస అవకాశాలతో బాగానే రాణించింది. సెకండ్ ఇన్నింగ్ లో ఈమె ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. సౌత్ లో రమ్యకృష్ణ తర్వాత ఆ స్థాయిలో ఇమేజ్ తో పాటు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నదియా అనే చెప్పాలి.

ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కూతుళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది నదియా. సనమ్, జానాలతో కలిసి నదియా దిగిన ఫోటో బాగా వైరల్ అయ్యింది. ఇక పెద్ద కూతురు కూడా అచ్చం తనలాగే ఉండటంతో హీరోయిన్ గా తొందరలోనే సినిమా పరిశ్రమకి పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తోందట. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించిన బాధ్యతలను సినిమా పరిశ్రమలో తనతో సన్నిహితంగా ఉంటున్న ఓ ప్రముఖ దర్శకుడికి అప్పగించినట్లు కొందరు చర్చించుకుంటున్నారు.

ఒక సినిమా విజయం సాధించిన తర్వాత, నటినటులు  తమ రాబోయే సినిమాలకు తమ రెమ్యునరేషన్ పెంచడం సర్వసాధారణం. ముఖ్యంగా ప్రధాన హీరోలతో పాటు ఎక్కువ పని చేసే హీరోయిన్లలో కూడా ఇదే ట్రెండ్. కొన్ని సందర్భాల్లో ఇంకా క్లీన్ హిట్స్ కూడా సాధించని హీరోలు హీరోయిన్లు ప్రతి సినిమా తర్వాత వారి జీతాలను పెంచుకుంటారు. ఇది కొంత వరకు అర్థమైనప్పటికీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా హాస్యాస్పదమైన రెమ్యూనరేషన్లను డిమాండ్ చేయడం ప్రారంభించారు.

అయితే నదియా ఇంతకు ముందు మాదిరిగానే ఆమె రోజుకి 2 నుంచి 3 లక్షల రూపాయలు పారితోషికం డిమాండ్ చేసిందట. అంతేగాక తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో మాత్రమే నటిస్తానని కూడా దర్శకనిర్మాతలకు నిర్మొహమాటంగా చెబుతోందట. అయితే ఈ విషయం ఇలా ఉండగా అప్పట్లో నదియా తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గని చిత్రంలో హీరో తల్లి పాత్రలో నటించింది.

ఆ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. అలాగే నాగ శౌర్య ప్రధానమైన పాత్రలో నటించిన వరుడు కావలెను అనే చిత్రంలో కూడా మంచి ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం సినిమా అవకాశాలు రాక ఖాళీగానే ఉన్నట్టు సమాచారం.