నటి పూనమ్ కౌర్ గురించి ఎవరికీ తెలియని నిజాలు.. ఇంతకు అవేంటంటే?

పూనమ్ కౌర్ తెలుగు సినిమా నటి, మోడల్. తమిళ, మలయాళ భాషలలో కూడా నటించింది. 2005 లో మిస్ ఆంధ్ర టైటిల్ గెల్చుకున్న పూనమ్ కౌర్. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన మాయాజాలం సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తరువాత ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్ మొదలైన చిత్రాలలో నటించడం జరిగింది.

తరువాత 2008లో గోపీచంద్ నటించిన శౌర్యం సినిమాలో సహాయక పాత్రలో నటించి ఉత్తమ సహనటిగా ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. ఇలా వరుస అవకాశాలతో మంచి సినిమాలు చేస్తూ తన నటనకు మంచి గుర్తింపు సంపాదించుకుంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూనమ్ కౌర్ కు ఈ మధ్య సినిమాలలో తక్కువగా కనిపిస్తున్నారు కదా అనే ప్రశ్న ఎదురయింది.

పూనమ్ కౌర్ దీనిపై స్పందిస్తూ సినిమా జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తన జీవితం కూడా అలాంటిదే అంటూ ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కొని నిలబడాల్సిందే. తమ పని తాము చేసుకోవాలి అంతే అని పేర్కొనడం జరిగింది. ఇంకా తన జీవితంలో తన తండ్రి తనకు ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చనిపోవడం జరిగిందని తెలిపింది.

తండ్రి చనిపోయాక తల్లితో ఉంటూ చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తూ జీవించడం వల్ల ఏ సమస్య వచ్చినా కూడా తనకు పెద్దగా బాధ అనిపించదని, ఆ సమస్యను అధిగమించే ప్రయత్నాలు చేస్తానని పేర్కొనడం జరిగింది. తాను చిన్నగా ఉన్నప్పుడు చుట్టుపక్కల నివసించే వారి జీవితాలను కళ్లారా చూశాను. అందుకే ఎప్పుడూ కూడా ధైర్యంగా ముందుకు వెళ్తానని తెలిపింది.

అయితే ప్రస్తుతం ఈమె నాతిచరామి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. సినిమాలలో మంచి అవకాశాలు వస్తే కచ్చితంగా హీరోయిన్ లేదా సహాయ పాత్రలో కూడా నటించడానికి సిద్ధమేనంటూ పేర్కొనడం జరిగింది.