సినిమా ఎంపిక పొరపాటుతో కనుమరుగైన సినీ తారలు ఎవరో తెలుసా?

సినీ ప్రపంచం నటీనటులకు ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒకసారి సక్సెస్ అయితే సరిపోదు దాన్ని నిరంతరం కొనసాగిస్తేనే ఇండస్ట్రీలో రాణించగలరు. చాలా కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సక్సెస్ లేకపోతే మంచి అవకాశాలు, మంచి గుర్తింపు అనేది లభించవు.

ఇక సినీ తారల విషయానికి వస్తే గ్లామర్ తో పాటు ఎంచుకునే సినిమా కథ కంటెంట్ కూడా చాలా ముఖ్యం. విజయాలను ఖాతాలో వేసుకుని కథ ఎంపికలో చేసిన కాస్త పొరపాటు వల్ల సినీ ఇండస్ట్రీలో కనుమరుగైన నటీమణులు ఎవరో చూద్దాం.

నేహా శర్మ: పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిరుత సినిమాలో రామ్ చరణ్ సరసన నటించి మొదటి సినిమాతోనే విజయం సొంతం చేసుకుంది. ఇక తర్వాత కుర్రాడు సినిమాలో నటించింది. ఈ సినిమా పరాజయం కావడంతో ఇక సినిమా అవకాశాలు రాలేదు.

అనిత హంస నందిని: దివంగత ఉదయ్ కిరణ్ తో కలిసి నువ్వు నేను సినిమాలో నటించింది. ఈ సినిమా విజయం సాధించడంతో ఇక అందరూ తిరుగులేదు అనుకున్నారు. కానీ కథ ఎంపికలో పొరపాట్ల వల్ల వరుస సినిమాలు పరాజయం అయ్యాయి.

కార్తిక: సీనియర్ హీరోయిన్ రాధా కూతురు. జోష్ సినిమాలో నాగచైతన్య సరసన నటించింది. ఈ సినిమా యావరేజ్ కాగా రంగం సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత తెలుగులో చేసిన దమ్ము సానుకూల ఫలితాలు ఇవ్వడంతో తెలుగు తెరకు దూరమైంది.

రక్షిత: పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇడియట్ సినిమాలో రవితేజ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆంధ్రావాలా, నిజం సినిమాలో నటించింది. ఈ సినిమాలు అనుకూనంత సక్సెస్ సాధించకపోవడంతో అవకాశాలు లేక తెలుగు తెరకు దూరమైంది.

ఇషా చావ్లా: ప్రేమ కావాలి చిత్రంతో మంచి విజయం సాధించింది. తరువాత కథల ఎంపిక పొరపాట్ల వల్ల వరుస సినిమాలు అనుకున్నంత విజయం సాధించాక పోవడం జరిగింది. ఇక అవకాశాలు లేక తెలుగు తెరకు కనుమరుగయింది.

శాలిని పాండే: అర్జున్ రెడ్డి సినిమాతో మంచి విజయం సాధించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత 118 చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత మహానటి సినిమాలో మెరిసింది కానీ ప్రయోజనం లేకుండా పోయింది. తెలుగు తెరకు కనుమరుగైపోయింది.