తమకంటే పెద్దవారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోలు ఎవరో తెలుసా?

ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ పుడుతుందో ఎవరికీ తెలియదు. ప్రేమకు కులం, మతం అవసరం లేదు. ప్రేమించుకోవడానికి రెండు మనసులు ఉంటే చాలు. ప్రేమ అనేది ఎంతమందినైనా ఎదిరిస్తుంది.

ప్రేమకు వయసుతో అస్సలు సంబంధం ఉండదు. సినీ ఇండస్ట్రీలో పెద్దలు కుదిరిచిన వివాహాల కంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్న వివాహాలే ఎక్కువ అని చెప్పవచ్చు. తమకంటే వయసులో పెద్దవారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తెలుగు ప్రముఖ హీరోల వివరాలు ఏంటో చూద్దాం.

అభిషేక్ బచ్చన్: ఇతను ఐశ్వర్యరాయ్ ను వివాహం చేసుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరూ సినీ రంగానికి చెందిన వారే కావడం. కలిసి కొన్ని సినిమాలలో నటించడం ద్వారా వీరికి పరిచయం ఏర్పడింది. అభిప్రాయాలు ఏకమవడంతో వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహ బంధం ద్వారా ఒకటి కావడం జరిగింది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ కంటే వయసులో 3 సంవత్సరాలు తక్కువ.

పవర్ స్టార్ రామ్ చరణ్: ఇతను అపోలో హాస్పిటల్ ఎండి ఉపాసనను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ వేర్వేరు రంగాలకు చెందినవారు. ఇద్దరూ కూడా మంచి స్నేహితులు. రామ్ చరణ్, ఉపాసన కంటే నాలుగు సంవత్సరాలు చిన్న, కుటుంబ సభ్యులను ఒప్పించి ఉపాసనను వివాహం చేసుకున్నాడు.

మహేష్ బాబు: ఇతను నమ్రతను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నమ్రత 1993లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. వంశీ సినిమాలో మహేష్ బాబు సరసన నటించడంతో వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది.

నమ్రత వయసులో మహేష్ బాబు కంటే మూడు సంవత్సరాలు పెద్దది. వీరి పెళ్లికి కృష్ణ ఒప్పుకోకపోవడంతో 2005 ఫిబ్రవరిలో వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారు.

స్నేహ: ఈమె తమిళ నటుడు ప్రసన్నను వివాహం చేసుకుంది. స్నేహ, ప్రసన్న కంటే ఒక సంవత్సరం పెద్దది. అయినప్పటికీ ఇరువురి కుటుంబ పెద్దలను ఒప్పించి, 2012లో వివాహం చేసుకున్నారు.

ధనుష్: ఇతను సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఐశ్వర్య, ధనుష్ కంటే రెండు సంవత్సరాలు పెద్దది. అయినప్పటికీ సూపర్ స్టార్ రజినీకాంత్ అంగీకారంతో వివాహం చేసుకున్నారు.