టాలీవుడ్ లో ఉన్నటువంటి ఎందరికో మోస్ట్ ఫేవరేట్ జంటలలో అక్కినేని స్టార్ హీరో నాగ చైతన్య మరియు సమంతల జంట కూడా ఒకటి. అయితే ఈ జంట అనూహ్యంగా విడాకులు ప్రకటించడం వారి అభిమానులకి ఇప్పటికీ తీరని బాదే అని చెప్పాలి. అయితే ఇక్కడ నుంచి చైతు కి ఏమో కానీ సమంత విషయంలో మాత్రం నెగిటివిటీ చాలా పెరిగిపోయింది.
బహుశా తాను ఒక మహిళా అయ్యి ఉండడం వల్లో ఏమో కానీ మానసికంగా అయితే సమంతకే చాలా దారుణ ప్రశ్నలు ఘటనలు ఎదురయ్యాయి. అయినా వాటిని సమంత ఎదుర్కొంటు సినిమాలు చేస్తూ తన ప్రొఫిషినల్ లైఫ్ లో బిజీగా ఉంది. కానీ ఈ ఇద్దరి ముగిసిపోయిన దాంపత్య జీవితంపై మాత్రం పలు రూమర్స్ అలా స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి.
అలా సమంత పి ఆర్ టీం నాగ చైతన్యపై నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారనే వార్తలపై సమంత గట్టిగానే స్పందించి సంచలన క్లారిటీ ఇచ్చింది. “ఒక రూమర్స్ అమ్మాయి మీద అయితే – అవి నిజం కావచ్చు. అదే ఒకవేళ అబ్బాయి మీద రూమర్స్ అయితే – అందుకు కారణం అమ్మాయే కావచ్చు.
ఇంకెప్పుడు ఎదుగుతారు మీరంతా? పరిస్థితులు మారుతున్నాయి. మీరు కూడా మూవ్ ఆన్ అవ్వాలి ఇంకా ఎన్నాళ్ళు ఇలా? మీ ఫ్యామిలీస్ ని జాగ్రత్తగా చూస్కోండి” అంటూ ఘాటు రిప్లై ఇచ్చింది. దీనితో అనేకమంది సమంతకి సపోర్ట్ చేస్తున్నారు.
Rumours on girl – Must be true !!
Rumours on boy – Planted by girl !!
Grow up guys ..
Parties involved have clearly moved on .. you should move on too !! Concentrate on your work … on your families .. move on!! https://t.co/6dbj3S5TJ6— Samantha (@Samanthaprabhu2) June 21, 2022