వామ్మో.. దర్శకుడుగా మారిన జబర్దస్త్ వేణు.. ప్రొడ్యూసర్ ఎవరు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

వేణు తెలుగు సినిమా నటుడు. బుల్లితెరలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో లో వేణు వండర్స్ గా అందరికీ సుపరిచితమే. ఇతను తేజ దర్శకత్వం వహించిన జై సినిమా ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించాడు. తరువాత రణం, దొంగలబంటి లాంటి చిత్రాలలో నటించి గుర్తింపు పొందాడు.

ఇలా అడపాదడపా అవకాశాలతో కెరీర్లో ముందుకు సాగుతున్న వేణు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు. నిజానికి పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.. ఎవరి టైం ఎప్పుడు మారుతుందో అస్సలు ఊహించలేరు.. ఏదైనా జరగడానికి లేదా మారడానికి ఎక్కువ సమయము పట్టదు.

ఇక అసలు విషయం ఏమిటంటే వేణు ఒక సినిమాకు దర్శకత్వం వహించి విడుదల చేయడానికి కూడా సిద్ధమైనట్లు వార్తలు రావడంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇందులో విశేషం ఏముంది అని అనుకుంటున్నారా.. వేణు దర్శకత్వం వహించిన సినిమాను నిర్మించింది బడా నిర్మాత దిల్ రాజు.

కథ నచ్చడంతో దిల్ రాజు ఓకే చెప్పడం. షూటింగ్ పూర్తి అవడం.. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో మిగిలిన పనులు పూర్తి చేసుకుంటుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి కేవలం తెలంగాణ ఆత్మహత్యల మీద ఒక కథ రాసి.. సినిమాను తీసినట్లు తెలుస్తుంది. మిగిలిన వివరాలు ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలవుతాయని తెలుస్తుంది.

హాస్యనటుడిగా తెలుగు బుల్లితెరకు పరిచయమైన వేణు.. జబర్దస్త్ షోలో తన ద్వారా చాలామందికి ఉపాధి కల్పించాడు. కొన్ని కారణాలవల్ల జబర్దస్త్ కు దూరంగా ఉండి సినిమా రంగం వైపు దృష్టి సారించాడు. ఇప్పుడు ఏకంగా దర్శకుడుగానే మారి సినిమాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఆయన సత్తా గురించి ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు. హాస్య పాత్రలలో అనుకున్న రీతిలో సక్సెస్ కాలేకపోయినా వేణు దర్శకుడిగా ఎంతవరకు సక్సెస్ అవుతాడో అని నెటిజన్స్ కామెంట్స్ చేయడం వల్ల ప్రస్తుతం టాలీవుడ్ లో అందరి దృష్టి ఈ సినిమా పైనే ఉంది.