సక్సెస్ గురించి ఒక్క మాటలో చెప్పేసిన వర్మ.. అదే తన స్టైల్!

రామ్ గోపాల్ వర్మ ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత. ఈయన సాంకేతిక పరిణితి చెందిన మాఫియా, హర్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలు తీయడంలో ప్రసిద్ధి. ఈయనకు చిన్నప్పటినుండి చదువు మీద కన్నా సినిమాలపైనే ఆసక్తి ఎక్కువ.

విడుదలైన ప్రతి చిత్రాన్ని చూసి అందులో తప్పొప్పుల గురించి స్నేహితులతో డిస్కషన్ చేసేవాడు. ఇక చదువు తర్వాత ఒక వీడియో దుకాణం ప్రారంభించి సినిమా ప్రయత్నాలు చేయగా రావు గారి ఇల్లు సినిమాకు సహాయ నిర్దేశకునిగా అవకాశం వచ్చింది. ఆ తరువాత కలెక్టర్ గారి అబ్బాయికి కూడా సహాయ నిర్దేశకునిగా పనిచేయడం జరిగింది.

తరువాత అక్కినేని నాగార్జునతో పరిచయం ఏర్పడి శివ సినిమా ద్వారా దర్శకునిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం పూర్తి విజయం సాధించింది. ఆ తరువాత క్షణక్షణం చిత్రం కూడా మంచి విజయం సాధించడంతో మంచి గుర్తింపు, పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు.

ఇక హిందీ రంగంలో కూడా ప్రవేశించి అనేక హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. కొన్ని సినిమాలకు తానే నిర్మాత, తానే రచయితగా దర్శకత్వం వహించడం జరిగింది. ఇలా తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్న రామ్ గోపాల్ వర్మ గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.

ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అంటే మీ ఉద్దేశంలో ఏంటి అనే ప్రశ్న ఎదురయింది. అందుకు తాను చాలా వివరంగా ఏదైనా పని ఇష్టంగా చేయడం, కొన్ని పనులు ఇష్టం లేకపోయినా చేయాల్సి రావడం జరుగుతుంది. గుర్తింపు కావాలని చేయకుండా తాను చేసే పనిలో నీతి నిజాయితీ ఉండి కష్టపడే మనస్తత్వం ఉంటేనే అది నిజమైన సక్సెస్ అవుతుంది.

ఏదో చేయాలి కాబట్టి చేసి ఆ పనిపై తగిన రీతిలో దృష్టి పెట్టకుండా కేవలం ఫలితం మాత్రం ఆశించడం చాలా పెద్ద పొరపాటు. కేవలం పనిచేస్తేనే, లేదంటే కష్టపడితేనే సక్సెస్ రాదు. చేసే పనికి ఒక ప్లానింగ్ ఉండాలి. అది ఎగ్జిక్యూట్ చేసే విధానం క్లియర్గా ఉండాలి అప్పుడు కష్టపడితే సక్సెస్ మన సొంతం అవుతుంది అని పేర్కొనడం జరిగింది.

ఇటీవలే 2022 మే లో ఈయన దర్శకత్వం వహించిన మా ఇష్టం సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒక సినిమా కోసం కథను రాసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.