దర్శకుడు కె. విశ్వనాథ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు.. ఇంతకీ అవేంటంటే?

కె. విశ్వనాథ్ తెలుగు చిత్ర దర్శకుడు. తెలుగు సినిమాకు ఒక గుర్తింపు, పేరు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. ఈయన పూర్తి పేరు కాశీనాధుని విశ్వనాథ్. ఈయన 1930లో గుంటూరులోని తెనాలిలో జన్మించాడు. విద్యాభ్యాసమంతా పూర్తయిన తర్వాత చెన్నై వెళ్లి సౌండ్ రికార్డ్ ఆర్టిస్టుగా చిత్ర పరిశ్రమలో అడుగు వేశాడు.

అదుర్తి సుబ్బారావు దగ్గర కొన్నాళ్లు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆత్మగౌరవం సినిమా ద్వారా కే. విశ్వనాథ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి నంది అవార్డు లభించింది. ఈయన జీవితంలో మర్చిపోలేని గొప్ప చిత్రం శంకరాభరణం. ఈ చిత్రానికి జాతీయ పురస్కారం అందింది.

శంకరాభరణం, సాగర సంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతిముత్యం ప్రధానంగా చెప్పుకోదగినవి. ఇలా కొంతకాలం అగ్ర దర్శకుడిగా తెలుగువారి గౌరవాన్ని భారతదేశం అంతటా చెప్పుకునేలా సినిమాలు దర్శకత్వం వహించాడు. ఇక దర్శకత్వంగా కాస్త జోరు తగ్గాక సినిమాలలో నటించడం ప్రారంభించాడు. శుభ సంకల్పం, నరసింహనాయుడు, ఠాగూర్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అతడు, ఆంధ్రుడు, మిస్టర్ ఫర్ఫెక్ట్, కలిసుందాం రా సినిమాలు ఆయన నటించిన వాటిలో ముఖ్యమైనవి.

సినిమా రంగంలో కృషి చేసినందుకుగాను 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును తీసుకున్నాడు. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నాడు.అదే సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. కళాతపస్వి ఆయన బిరుదు. ఈయన సినిమాలలో సంగీతానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు.

దాదాపు ఈయన దర్శకత్వం వహించిన సినిమాలకు ఇళయరాజా, కె.వి.మహదేవన్ సంగీత దర్శకులుగా పనిచేశారు. ఈయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలు జాతీయ చలనచిత్రంగా పేరు పొందాయి. దాదాపు ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి అందరూ అగ్ర హీరోల సినిమాలకు దర్శకత్వం వహించిన ఘనత ఈయనకే దక్కుతుంది. మంచి కుటుంబ కథ చిత్రాలు, సినిమాలలో సంగీతం, సాహిత్యం ఉన్న సినిమాలకు దర్శకత్వం వహించిన పేరు ఈయన సొంతం.