సుమంత్ తెలుగు చలనచిత్ర నటుడు. అందరికీ సుపరిచితుడే. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారి పెద్ద మనువడు. 1975లో హైదరాబాదులో జన్మించాడు. ఇతని పూర్తి పేరు యార్లగడ్డ సుమంత్ కుమార్. ఈయన తండ్రి సురేంద్ర కూడా కొన్ని సినిమాలను నిర్మించడం జరిగింది.
ఇక నట జీవితాన్ని 1999లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ప్రేమ కథ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు. బిజినెస్ పరంగా కాస్త విజయం సాధించినప్పటికీ, తన నటనకు మంచి గుర్తింపు మొదటి సినిమా నుండే లభించింది. ఆ తర్వాత వరుసగా నటించిన సినిమాలు అనుకున్నంతగా విజయాలు, పేరును తీసుకురాలేదు.
ఇక ఈయన కెరీర్లో సత్యం, గౌరీ, గోదావరి, మధుమాసం, గోల్కొండ హై స్కూల్, మళ్లీ రావా, సీతారామం అనేవి ముఖ్యమైన, చెప్పుకోదగ్గ సినిమాలు. ఈయనకు అన్నపూర్ణ స్టూడియోలో భాగస్వామ్యం కూడా ఉంది. ఈయన కెరీర్లో అనుకున్నంతగా విజయం సాధించకపోవడానికి గతంలో తాను వదులుకున్న సూపర్ హిట్ సినిమాలు ఒక రకంగా కారణం అయి ఉండొచ్చు.
పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా మంచి సూపర్ హిట్. అయితే దర్శకుడు కరుణాకర్ ముందుగా ఈ కథను సుమంత్ కు చెప్పాడు. ఇతను రిజెక్ట్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేయడం జరిగింది. తరువాత పూరి దర్శకత్వంలో రవితేజ నటించిన చిత్రం ఇడియట్. ఈ కథ ముందుగా సుమంత్ కు చెప్తే రిజెక్ట్ చేయడం ద్వారా రవితేజ చేయడం జరిగింది.
ఇక సుమంత్ తన కెరీర్లో వదులుకున్న బెస్ట్ సినిమాలు వరుసగా మనసంతా నువ్వే, నువ్వే కావాలి, దేశముదురు, నువ్వొస్తావని, గమ్యం, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్, ఆనందం, అష్టా చమ్మా కథలు ముందుగా సుమన్ వద్దకు వస్తే కొన్ని ఈయన రిజెక్ట్ చేస్తే, మరికొన్ని నాగార్జున వద్దు అంటే చేయలేదు. ఈ సినిమాలు గనుక చేసి ఉంటే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాగా స్టార్ హీరోగా ఎదిగే వారిని తెలుస్తుంది.
ప్రస్తుతం ఈయన సీతారామం లో నటించిన విషయం తెలిసిందే. ఇక ముందైనా కథ విషయంలో కాస్త ఆలోచనలు మార్చుకుంటే బాగుంటుందని ప్రేక్షక అభిమానుల అభిప్రాయం.