Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రీ రిలీజ్ కాబోతున్న కల్ట్ క్లాసిక్ మూవీ.. పండగే!

Pawan Kalyan: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు విడుదల అయ్యి మంచి విజయం సాధించిన సినిమాలతో పాటు ఫ్లాప్ అయిన సినిమాలను కూడా థియేటర్లలో మళ్లీ విడుదల చేస్తున్నారు మూవీ మేకర్స్. అలా ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యి విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఒకదానిని మించి ఒకటి సినిమాలు రీ రిలీజ్ లో బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లను సాధిస్తున్నాయి. నెలకు మూడు నాలుగు సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే దాదాపు అందరు హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అయితే రీ రిలీజ్ సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషంగా రెస్పాన్స్ వస్తుంది. అయితే తెలుగులో ఇప్పటికే ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి కలెక్షన్స్ అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కల్ట్ క్లాసిక్ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఆ సినిమా మరేదో కాదు తొలిప్రేమ. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ చేయనున్నారు. తొలిప్రేమ సినిమాను జూన్ 14వ తేదీన గ్రాండ్‌ గా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తొలిప్రేమ సినిమా రిలీజ్ కాబోతుండడంతో ఆనందంతో సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. ఫ్యాన్స్ కి ఇది నిజంగా పండగ లాంటి వార్తే అని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కెరియర్ లో మర్చిపోలేని సినిమాలలో తొలిప్రేమ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఇప్పటికీ టీవీలలో ప్రసారమైతే ఇంట్రెస్టింగ్ గా చూసేవారు ఎంతోమంది ఉన్నారు.