నటుడు ఎల్బీ శ్రీరామ్ గురించి ఎవరికీ తెలియని అసలు నిజాలు ఇవే?

ఎల్బీ శ్రీరామ్ తెలుగు సినీ నటుడు. తెలుగు సినిమాలలో తన రచనలకు బాగా ప్రసిద్ధి పొందాడు. చిన్నతనం నుంచే నాటకాలలో నటించడం ప్రారంభించాడు. తరువాత నాటకాలను రచిస్తూ సినీ రంగంలోకి ప్రవేశించాడు. ఇతను 40 కి పైగా సినిమా కథలను రాస్తే అందులో 25 కు పైగా సినిమాలు విజయం సాధించాయి.

ఎల్బీ శ్రీరామ్ దాదాపుగా 400 చిత్రాలలో నటించడం జరిగింది. ఒకవైపు రచయితగా.. మరొకవైపు నటుడిగా బాగా గుర్తింపు పొందిన ఇతను 1991 లో ఏప్రిల్ ఒకటి విడుదల చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా కథను రచించింది కూడా ఇతనే. ఆ తరువాత అప్పుల అప్పారావు సినిమా కథ రచించి అందులో కూడా నటించడం జరిగింది.

ఇలా తన సినీ జీవితాన్ని ప్రారంభించి.. దర్శకుడు ఇ. వి. వి సత్యనారాయణ ప్రోత్సాహంతో తెలంగాణ పల్లెటూరి యాస పాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీలోని క్యారెక్టర్ ఆర్టిస్టులలో తాను కూడా ఒక ప్రముఖుడిగా మంచి గుర్తింపు పొందాడు.

ఇలా వరుస అవకాశాలతో ముందుకు సాగుతున్న ఎల్బీ శ్రీరామ్ గతంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొని తన మనసులో మాటలను పంచుకున్నాడు. ఆ ఇంటర్వ్యూ ద్వారా తాను ఏదో మారుమూల ప్రాంతంలో జన్మించానని.. చిత్ర పరిశ్రమలో ఈ స్థాయికి వస్తానని అనుకోలేదని చెప్పాడు.

తాను కుటుంబంలో ఆరవ వ్యక్తిని.. తన సహోదరులు నాటకాలలో నటించడం వల్ల చిన్నప్పటినుండే తాను కూడా నటనపై ఆసక్తితో.. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ నాటకాలలో నటించేవాడిని తెలిపాడు. కొంతకాలం తర్వాత కేవలం రచయితగా మాత్రమే కొనసాగాలనుకున్నాడట.

తన రచనలకు ఇ.వి.వి సత్యనారాయణ గారు మెచ్చుకొని, తనకు తెలంగాణ యాసలో మాట్లాడే పాత్రలు సరిగ్గా సెట్ అవుతాయని ప్రోత్సహించడంతో నటనలోకి ప్రవేశించడం జరిగిందని తెలిపాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో రాణించడం జరిగిందని పేర్కొనడం జరిగింది.

ఇక ఎల్బి శ్రీరామ్ నిర్మాతగా మారి 2021లో కవిసామ్రాట్ సినిమాను నిర్మించడం జరిగింది. ఇక 2002లో కొండా సినిమాలో నటించడం జరిగింది. ప్రస్తుతం ఈయన యూట్యూబ్లో హార్ట్ ఫిలిమ్స్ లఘు చిత్రాలు రూపొందిస్తున్నారు. మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.