మురళీమోహన్ గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర నిజాలు ఇవే!

మురళీమోహన్ తెలుగు సినిమా కథానాయకుడుగా, నిర్మాతగా అందరికీ సుపరిచితం. జయభేరి గ్రూప్స్ అధినేత. ఇతని అసలు పేరు మాగంటి రాజబాబు. 1940లో పశ్చిమగోదావరి జిల్లాలోని చాటపర్రు గ్రామంలో జన్మించాడు. విద్యాభ్యాసం అంత ఏలూరులో జరిగింది. 1963 లో ఎలక్ట్రిక్ మోటార్లు, ఆయిల్ ఇంజన్ల వ్యాపారం ప్రారంభించి విజయవాడలో నాటకాలలో నటించేవాడు.

ఈయన విజయలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి హిమబిందు అనే అమ్మాయి, రామ్మోహన్ అనే అబ్బాయి సంతానం. 1973లో జగమేమాయ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. 1974లో దాసరి నారాయణరావు తీసిన తిరుపతి సినిమాలో నటించడం ద్వారా గుర్తింపు లభించింది. ఇతను దాదాపు 350 చిత్రాలలో నటించాడు. తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు.

తన సోదరుడు కిషోర్ తో కలిసి జయభేరి ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి దాదాపు 25 చిత్రాలను నిర్మించాడు. ఇతను నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లలో వివిధ హోదాలలో సేవలందించాడు. 2015 వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియన్ కు గౌరవ అధ్యక్షునిగా వ్యవహరించాడు. ఈయన రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టి జయభేరి సంస్థను స్థాపించి దానికి చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ముందుకి సాగడం జరిగింది. అయితే సినిమాలలో కంటే వ్యాపారాల్లోకి వచ్చిన తర్వాతనే ఎక్కువ ఆటంకాలు ఎదురయ్యాయి.1985లో వచ్చిన ఓ తండ్రి తీర్పు సినిమా ద్వారా ఉత్తమ నటుడిగా నంది అవార్డు తీసుకున్నాడు. ఇతను రాజకీయాలలో ప్రవేశించి తెలుగుదేశం పార్టీలో చేరాడు.

2009లో జరిగిన 15వ లోకసభ కు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో దాదాపు 2000 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. 2014 లో జరిగిన 16వ లోకసభ కు రాజమండ్రి నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించాడు. ప్రస్తుతం వివిధ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది.