ఈ స్టార్ హీరోల భార్యలు సంపాదనలో భర్తలనే మించిపోయారుగా!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోల పారితోషకం ఏకంగా కోట్లల్లో ఉంటుంది. ఇంకా కొంతమంది స్టార్ హీరోలు సినిమాలలో వచ్చే లాభాలలో కూడా వాటాలు తీసుకుంటారు. మరికొందరైతే డిజిటల్ రైట్స్ లో కూడా వాటాలు తీసుకుంటారు. ఇంకా కొందరు గుర్తింపు పొందిన నటులు కూడా హీరోలకు ఏమాత్రం తగ్గకుండా రెమ్యూనరేషన్ తీసుకుంటారు.

ఇక అసలు విషయానికి వస్తే తెలుగు స్టార్ సెలబ్రెటీల భార్యలు కూడా భర్తలకు ఏమాత్రం తీసిపోకుండా వారికి ఆసక్తి ఉన్న రంగాలలో రాణిస్తూ బాగా సంపాదిస్తున్నారు. అలా సంపాదిస్తున్న కొందరు సెలబ్రిటీల భార్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

హీరో నాని: ఇతని భార్య అంజన కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుంది. ఆర్కే మీడియా సంస్థకి, దర్శకుడు రాజమౌళి కోసం పనిచేస్తుంది. ఈమె సంపాదన లక్షల్లో ఉంటుంది. బాహుబలి సినిమాలో కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేయడం జరిగింది.

హీరో రామ్ చరణ్: ఇతని భార్య ఉపాసన హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేసి భారీగానే సంపాదిస్తుంది. రామ్ చరణ్ కు సంబంధించిన అన్ని బిజినెస్ వ్యవహారాలకు సపోర్టుగా ఉండి తానే చూసుకుంటుంది.

హీరో అల్లరి నరేష్: ఇతని భార్య విరూప ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్థాపించి.. ఒక్కో ఈవెంట్ కు లక్షల్లో సంపాదిస్తుంది.

హీరో అల్లు అర్జున్: ఇతని భార్య స్నేహ రెడ్డి స్పెక్ట్రమ్ అనే మ్యాగజైన్ కి చీఫ్ ఎడిటర్ గా పనిచేస్తుంది. మరొకవైపు తండ్రి స్థాపించిన షైన్ ఇన్స్టిట్యూట్ ను చూసుకుంటుంది.

నటుడు రాజీవ్ కనకాల: ఈయన భార్య యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. బుల్లితెరపై యాంకర్ గానే కాకుండా సినిమా ఫంక్షన్లలో కూడా యాంకర్ గా బాగానే సంపాదిస్తుంది.

హీరో రాజశేఖర్: ఇతని భార్య జీవిత ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ, సెన్సార్ బోర్డ్ మెంబర్ గా కూడా పనిచేస్తూ.. ఈమె కూడా బాగానే సంపాదిస్తున్నారు.

హీరో మహేష్ బాబు: ఇతని భార్య నమ్రత కాస్ట్యూమ్ డిజైనర్ గా కొనసాగుతూ.. మహేష్ బాబు కు సంబంధించిన అన్ని బిజినెస్ వ్యవహారాలను దగ్గరుండి ఈమె చూసుకుంటారు.