దారుణ స్థితిలో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటి.. ఏం జరిగిందంటే!

జయ కుమారి దక్షిణ భారత చలనచిత్ర నటి. 1960లో తమిళం, మలయాళం లో ప్రముఖ నటి. ఈమె గ్లామర్ పాత్రలతో గుర్తింపు పొందింది. అప్పట్లో తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అందరూ అగ్ర హీరోల సరసన నటించింది. దాదాపు హీరోయిన్ గా, సహాయ పాత్రలలో 400కు పైగా చిత్రాలలో నటించింది.

ఈమె నాగపట్నం అబ్దుల్లా ను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. కొన్ని సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా ఎదిగి ప్రస్తుతం ఆమె చాలా దీనస్థితిలో ఉంది. జయ కుమారి రెండు కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ కొరకు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఇద్దరు కుమారులు కూడా అద్దెనివాసంలో జీవించడం, వారిపై భారమెందుకు అని అనుకుంది.

భర్త చనిపోయాక ఆర్థిక పరిస్థితులు ఆ కుటుంబాన్ని వెంటాడాయి. ఒక రేంజ్ లో అగ్ర నటిగా పేరుపొందిన నాటికి సొంత ఇల్లు కూడా లేకపోవడం చాలా దారుణం. దాతలు ఎవరైనా సహాయం చేయాలని బంధువులు ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఆమె చెన్నై ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంది.

తన కుమారునితో కలిసి చెన్నైలోని ఒక ప్రాంతంలో నివాసం ఉంటుంది. భర్త చనిపోయి చాలా రోజులు కావడం వలన ఆర్థిక పరిస్థితి దెబ్బతిని డబ్బు మొత్తం పోగొట్టుకోవడం జరిగింది. ఈ విషయం తెలిసిన చాలా మంది అంతా స్థాయికి ఎదిగిన ఒక హీరోయిన్ చివరికి ఇలాంటి కష్టాలను అనుభవిస్తుందా వాపోయారు.

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి తరువాత కనీస అవసరాలకు కూడా డబ్బులు లేని దీనస్థితిలో ఉన్న సినీ తారల ఎంతోమంది ఉన్నారు. వెండితెరపై తమదైన ముద్ర వేసుకొని నిజ జీవితంలో అనేక కష్టాలను అనుభవిస్తుంటారు చాలామంది నటీనటులు.